ప్రభుత్వానికి వ్యతిరేకంగా థాయ్‌లాండ్‌లో ప్రజాందోళనలు మిన్నంటాయి. పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనల్లో కాల్పులు జరగగా.. మరో 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. నిరసనకారులపై కాల్పులు జరిపిన వారు ఎవరు అనే విషయం తెలియరాలేదు.
ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ సవరణలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుత ప్రధాని ప్రయూత్ దేశంలో మిలటరీతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. రాచరిక పాలనలో సంస్కరణలు తీసుకురావాలని కోరుతున్నారు. ఈ క్రమంలో థాయ్పార్లమెంట్ భవనాన్ని చుట్టు ముట్టేందుకు ప్రయత్నించారు ఆందోళనకారులు. అడ్డంగా ఉన్న బారికేడ్లను తొలిగించి పోలీసులపై రాళ్లు విసిరారు. ఈ క్రమంలో నిరసనకారులపై భాష్పవాయువు ప్రయోగించడం సహా రంగు నీళ్లతో అదుపుచేసే ప్రయత్నం చేశారు.
రెండు రోజులు జరిగే ఉమ్మడి పార్లమెంట్ సమావేశాల్లోని రాజ్యాంగంలో ఏడు సవరణలకు ప్రజాప్రతినిధులు ఓటు వేసి... అమలులోకి తీసుకురానున్నారు.