ETV Bharat / international

Afghan Taliban: అమెరికా సైన్యం ఆయుధాలు పాక్ ఉగ్రవాదుల చేతికి!

ఇటీవల తాలిబన్లు (Afghan Taliban) ఆక్రమించుకున్న అఫ్గానిస్థాన్​ నుంచి పాకిస్థాన్​కు భారీగా ఆయుధాల సరఫరా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా సైన్యం వదిలివెళ్లిన అత్యాధునికి వెపన్స్​ను పాక్​లోని ఉగ్రమూకలకు అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అఫ్గాన్​ నుంచి పాక్​కు ఆయుధాలతో వెళ్తున్న ఓ ట్రక్కును తాలిబన్లు(Afghan Taliban news) స్వాధీనం చేసుకున్నట్లు పాక్​ స్థానిక మీడియా వెల్లడించింది.

Afghan Taliban
భారీగా ఆయుధాల సరఫరా
author img

By

Published : Sep 17, 2021, 9:26 AM IST

Updated : Sep 17, 2021, 9:41 AM IST

పాకిస్థాన్‌కు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తీసుకెళ్తున్న ఓ ట్రక్కును తాలిబన్లు (Afghan Taliban) స్వాధీనం చేసుకున్నారు. పెద్దసంఖ్యలో ఆయుధాలతో వెళ్తున్న ఓ ట్రక్కును కాందహార్​ ప్రావిన్స్‌లో పట్టుకున్నట్లు పాక్​ స్థానిక మీడియా పేర్కొంది. అఫ్గాన్​లో(Afghanistan news) అమెరికా సేనలు విడిచి వెళ్లిన ఆయుధాలే లక్ష్యంగా పాక్ సరిహద్దుల్లో స్మగ్లింగ్​ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తనిఖీలు చేపట్టిన తాలిబన్లు.. పాకిస్థాన్‌కు భారీగా ఆయుధాల తరలించే కుట్రను భగ్నం చేసింది.

హెల్మాండ్ ప్రావిన్స్ నుంచి వెళ్తున్న ట్రక్కును కాందహార్‌లోని డామన్​ జిల్లాలో తాలిబన్లు (Taliban news) సీజ్​ చేసినట్లు పాక్ మీడియా వెల్లడించింది. ఈ క్రమంలో భారీ సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని.. అలాగే ట్రక్కు డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని గుర్తు తెలియని ప్రదేశానికి తరలించి విచారిస్తున్నట్లు పేర్కొంది. చమన్ ద్వారా పాక్​లోని ఉగ్రవాదులకు ఈ ఆయుధాలను అక్రమంగా చేరవేస్తున్నట్లు తాలిబన్​ కమాండర్​(Taliban latest news) చెప్పారని ఓ వార్తా సంస్థ పేర్కొంది.

తాలిబన్లు.. అఫ్గాన్​ను ఆక్రమించుకున్న తర్వాత వాహనాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే 85 బిలియన్​ డాలర్ల విలువైన ఆయుధాలను అమెరికా సేనలు విడిచి వెళ్లినట్లు గతనెలలో డొనాల్డ్​ ట్రంప్​ జూనియర్​ తెలిపారు.

ఇదీ చూడండి: Afghanistan women: 'మహిళలను మనుషుల్లానే చూడట్లేదు!'

Last Updated : Sep 17, 2021, 9:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.