ETV Bharat / international

పాక్‌లో టి-తాలిబన్‌ ఆత్మాహుతి దాడి - ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో 'తెహ్రీక్‌-ఈ-తాలిబన్‌ పాకిస్థాన్‌' (టీటీపీ) ఉగ్ర సంస్థ ఆత్మాహుతి దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో నలుగురు సిబ్బంది మృతిచెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Taliban attack in pakisthan
ఆత్మాహుతి దాడి
author img

By

Published : Sep 6, 2021, 6:41 AM IST

పాకిస్థాన్‌లో 'తెహ్రీక్‌-ఈ-తాలిబన్‌ పాకిస్థాన్‌' (టీటీపీ) ఉగ్ర సంస్థ దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని క్వెట్టా చెక్‌పోస్టు వద్ద భద్రతా సిబ్బందే లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో నలుగురు సిబ్బంది మృతిచెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

పేలుడు పదార్థాలున్న బైకుపై వచ్చిన ఆత్మాహుతి సభ్యుడు.. సరిహద్దు భద్రతా సిబ్బంది వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టినట్టు దర్యాప్తులో గుర్తించారు. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరగొచ్చని క్వెట్టా పోలీసు డీఐజీ అజార్‌ అక్రమ్‌ చెప్పారు. టీటీపీ సభ్యులు అఫ్గానిస్థాన్‌లో దాక్కుని పాక్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. తాలిబన్ల సాయంతో వీరిని నిలువరించాలని పాక్‌ ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నా సాధ్యమవడం లేదు. ఈ క్రమంలోనే తాలిబన్లు అఫ్గాన్‌ను చేజిక్కించుకొనేలా పాక్‌ అన్నివిధాలా సహకరించింది. త్వరలో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైతే వారి ద్వారా టీటీపీని నాశనం చేయొచ్చని భావిస్తోంది. అయితే పాక్‌ పాచికలేవీ తమ విషయంలో పారవన్న సందేశాన్ని.. టీటీపీ తాజా ఆత్మాహుతి దాడితో చాటింది. టీటీపీ చర్యను పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్రంగా ఖండించారు. విదేశీ మద్దతుతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని వాపోయారు.

ఇదీ చదవండి:Taliban Panjshir: తాలిబన్లపై షేర్​ 'పంజా'- 700 మంది హతం!

కాల్పుల కలకలం- 8 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.