దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై 7.0తో భూకంపం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదన్నారు.
దావో రాష్ట్రంలోని పొండగుయిటన్కి ఆగ్నేయంగా 210 కిలోమీటర్ల దూరంలో.. సముద్రంలో 95.8కిలోమీటర్ల లోతులో భూకంపం ఏర్పడ్డట్లు తెలిపారు అధికారులు. అయితే సునామీ హెచ్చరిక జారీ చేసేంత స్థాయిలో భూకంపం రాలేదని అమెరికాకు చెందిన భౌగోళిక సర్వే పేర్కొంది.
పక్కనున్న నగరాలు భూకంపం ధాటికి ప్రభావితమైనట్లు ఫిలిప్పీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాల్కెనోలాజీ, సిస్మోలాజీ వెల్లడించింది.
ఇదీ చూడండి: ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం- ఏడుగురు మృతి