ETV Bharat / international

సింగపూర్​లో వ్యాక్సినేషన్​- బ్రిటన్​లో రెండో డోసు - US Corona vaccine updates

కొవిడ్​-19 నుంచి విముక్తి పొందేందుకు​ వ్యాక్సినేషన్​ ప్రారంభించింది సింగపూర్. ఫలితంగా టీకా అందించిన తొలి ఆసియా దేశంగా నిలిచింది​. అటు బ్రిటన్​లో టీకా రెండో డోసు అందించడం మొదలుపెట్టారు.

Singapore starts COVID-19 vaccination for healthcare workers
సింగపూర్​లో వ్యాక్సినేషన్​- తొలి ఆసియా దేశంగా గుర్తింపు
author img

By

Published : Dec 30, 2020, 11:18 AM IST

Updated : Dec 30, 2020, 11:32 AM IST

ఆరోగ్య కార్యకర్తలకు కరోనా వ్యాక్సినేషన్​ కార్యక్రమం ప్రారంభించింది సింగపూర్​. ఫలితంగా ఫైజర్​-బయోఎన్​టెక్​ టీకాను ఉపయోగించిన తొలి ఆసియా దేశంగా నిలిచింది. త్వరలోనే మరిన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో విస్తృతంగా టీకా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

వ్యాక్సినేషన్​ ప్రక్రియలో 70ఏళ్లు పైబడిన వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది ఆరోగ్య నిపుణుల కమిటీ. ఆ తర్వాత వైద్య సిబ్బంది, కరోనా యోధులు సహా.. వైరస్ నుంచి ముప్పు ఎక్కువగా ఉన్నవారికి టీకా అందించాలని సిఫార్సు చేసింది.

ఈ వ్యాక్సిన్​ కరోనాను వెంటనే నివారించలేనప్పటికీ.. దేశాన్ని సురక్షిత స్థాయిలో ఉంచేందుకు దోహదపడుతుందని ఆరోగ్య శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.

సింగపూర్​లో ఇప్పటివరకు 58వేల 542 మందికి వైరస్​ సోకింది. 29 మంది కొవిడ్​కు బలయ్యారు. 58వేల 400 మంది మహమ్మారిని జయించగా.. ప్రస్తుతం 113 యాక్టివ్​ కేసులున్నాయి.

యూకేలో మలి దఫా..

బ్రిటన్​లో కొందరికి టీకా రెండో డోసును అందించారు అధికారులు. డిసెంబర్​ 8న అక్కడ వ్యాక్సినేషన్​ ప్రక్రియ ప్రారంభమవ్వగా.. 91 ఏళ్ల మార్గరెట్​ కీనన్​ ఆ దేశం తరఫున టీకా పొందిన తొలివ్యక్తిగా నిలిచారు. మార్గరెట్​కు ఇటీవల రెండో డోసు అందించారు వైద్యాధికారులు.

టీకా తీసుకున్న కమలా హారిస్​..

అమెరికా కొత్త ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​.. వాషింగ్టన్​లో మంగళవారం కొవిడ్​-19 మోడెర్నా టీకా తీసుకున్నారు. టీకాపై ప్రజలకు మరింత విశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నాల్లో భాగంగానే ఆమె బహిరంగంగా వ్యాక్సిన్​ తీసుకున్నట్టు తెలుస్తోంది. హారిస్​తో పాటు ఆమె భర్త డౌగ్​ ఎమ్​హాఫ్​ కూడా వ్యాక్సిన్​ వేయించుకున్నారు.

Kamala Harris has received the first dose of the Moderna COVID-19 vaccin
టీకా తీసుకుంటున్న కమలా హారిస్​

ఇదీ చదవండి: కొత్త రూల్​- చిన్న పిల్లలకు కేక్, ఐస్​క్రీమ్​ బంద్!

Last Updated : Dec 30, 2020, 11:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.