ETV Bharat / international

పరారీలో మాజీ ప్రధాని.. ప్రభుత్వం ప్రకటన - fedaral cabinet president

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్​పై​ ఆ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైద్యానికి సంబంధించిన నివేదికల సమర్పణలో​ కోర్టు ఆదేశాలను షరీఫ్ ధిక్కరించారని, చికిత్స పేరుతో ఆయన లండన్​కు పారిపోయారని ప్రకటించింది ఇమ్రాన్​ సర్కార్​.

Sharif declared absconder by govt for violating bail terms: Report
కేసు నుంచి తప్పించుకునేందుకు పరారీలో మాజీ ప్రధాని..
author img

By

Published : Feb 26, 2020, 8:53 PM IST

Updated : Mar 2, 2020, 4:29 PM IST

పాక్​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్ విషయంలో కీలక ప్రకటన చేసింది ఆ దేశ ప్రభుత్వం. చికిత్సకోసం లండన్​ వెళ్లిన షరీఫ్​ కోర్టుకు ఎలాంటి ఆధారాలు సమర్పించనందున ఆయన పరారీలో ఉన్నట్లు పేర్కొంది.

పనామా పత్రాల కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న షరీఫ్​ చికిత్స కోసం బెయిల్​పై లండన్​ వెళ్లారు. ఈ క్రమంలో చికిత్సకు సంబంధించిన వైద్య నివేదికను సమర్పించాలని లాహోర్​ కోర్టు ఆదేశించగా.. గడువులోగా షరీఫ్​ సమర్పించలేదు. దీన్ని తీవ్రంగా పరిగణించిన పాక్​ సర్కారు షరీఫ్ పారిపోయినట్లు ప్రకటించింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన జరిగిన ఫెడరల్ కేబినెట్​​ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కేసు నుంచి తప్పించుకునేందుకే..

షరీఫ్​ కేసు నుంచి తప్పించుకునేందుకే లండన్ వెళ్లారని, చికిత్స కోసమే వెళ్లుంటే ఇప్పటికే వైద్య నివేదికను న్యాయస్థానానికి సమర్పించేవారని అభిప్రాయపడిన ప్రభుత్వం ఆయన్ను 'అబ్​స్కాండర్​'గా ప్రకటించింది. అంతేకాకుండా అతనికి మంజూరు చేసిన బెయిల్​ కూడా పొడిగించకూడదని నిర్ణయించింది. ప్రస్తుతం అతను దేశానికి తిరిగి రానట్లయితే నేరస్థుడిగా ప్రకటిస్తామని హెచ్చరించింది.

షరీఫ్​​ వైద్యుడు ఏమన్నాడంటే..

నవాజ్​ షరీఫ్​ గుండెపోటుతో పాటు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని, ఆయన రక్తంలో ప్లేట్​లెట్ల సంఖ్య గణనీయంగా పడిపోతోందని షరీఫ్​ వైద్యుడు తెలిపారు. త్వరలో షరీఫ్​కు ఓ శస్త్రచికిత్స జరగనున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి: కరోనా: చైనాలో 2,715కు చేరిన మృతుల సంఖ్య

Last Updated : Mar 2, 2020, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.