ETV Bharat / international

ఆసుపత్రికి నిప్పంటినా.. ఓపెన్‌-హార్ట్‌ సర్జరీ సక్సెస్‌! - రష్యా వైద్యుల సాహసం

ఆస్పత్రి అగ్నిప్రమాదానికి గురైందని తెలియగానే ఎవరైనా హూటాహుటిన పరుగెత్తి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ, రష్యాలోని వైద్యులు సాహసం చేశారు. ఓవైపు ఆస్పత్రి అంతటా మంటలు వ్యాపిస్తున్నా.. మొదలుపెట్టిన ఓపెన్​-హార్ట్​ సర్జరీని పూర్తిచేసే వరకూ ఆపలేదు. సుమారు 2గంటల పాటు శ్రమించి ఈ శస్త్రచికిత్సను విజయవంతం చేశారు.

Russia fire accident in hospital but Open heart surgery success in blagoveshchensk
ఆసుపత్రికి నిప్పంటినా.. ఓపెన్‌-హార్ట్‌ సర్జరీ సక్సెస్‌!
author img

By

Published : Apr 3, 2021, 9:58 AM IST

ఓవైపు ఆసుపత్రి అగ్ని ప్రమాదానికి గురై మంటలు చెలరేగుతున్నా.. వైద్యులు అత్యవసర పరిస్థితుల్లో సాహసోపేతంగా ఓ రోగికి ఓపెన్‌-హార్ట్‌ సర్జరీని పూర్తిచేశారు. రష్యాలోని బ్లాగోవెస్కెన్స్‌క్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. జార్‌ల కాలం నాటి ఓ ఆసుపత్రిలో వైద్యులు శస్త్రచికిత్సను ప్రారంభించిన కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి. వైద్య సిబ్బంది ఏ మాత్రం బెదరకుండా.. 2 గంటల పాటు సర్జరీని విజయవంతంగా పూర్తిచేసి రోగిని వేరేచోటుకు మార్చారు.

ఆసుపత్రికి నిప్పంటినా.. ఓపెన్‌-హార్ట్‌ సర్జరీ సక్సెస్‌!

సంరక్షణ చర్యలు చేపట్టారిలా..

ఆసుపత్రి అగ్ని ప్రమాదానికి గురైన వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 గంటలకుపైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. అదే సమయంలో ఓపెన్‌-హార్ట్‌ సర్జరీ చేస్తున్న గదికి అన్నివిధాలుగా సంరక్షణ ఏర్పాట్లు చేశారు. లోపలికి పొగ వెళ్లకుండా పెద్ద ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆ గదికి విద్యుత్తు సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక కేబుళ్లను ఏర్పాటు చేశారు. 8 మంది వైద్యులు, నర్సులతో కూడిన బృందం సర్జరీలో పాల్గొంది. "మంటలు చెలరేగినా.. ఆ రోగిని కాపాడేందుకు మేం చేయగలిగిందంతా చేశాం" అని వైద్యులు తెలిపారు.

ఈ ఆసుపత్రిని 1907లో నిర్మించారు. పైకప్పు చెక్కతో చేసింది కావడం వల్ల నిప్పంటుకుని మంటలు చెలరేగినట్లు రష్యా అత్యవసర సేవల మంత్రిత్వశాఖ తెలిపింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ఆసుపత్రి నుంచి 128 మందిని ఖాళీ చేయించి సురక్షితంగా తరలించినట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: పాకిస్థాన్​ టెక్స్​టైల్స్ పరిశ్రమకు తీవ్ర నిరాశ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.