ETV Bharat / international

పాక్​లో బాంబు పేలుడు- ఐదుగురు మృతి

author img

By

Published : Mar 6, 2021, 9:58 PM IST

పాకిస్థాన్​లో జరిగిన బాంబు పేలుడులో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. అయితే.. ఈ దాడికి కారకులెవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు.

Roadside bomb kills 5 labourers in Pakistan
పాక్​లో బాంబు దాడి- ఐదుగురు మృతి

పాక్​లో రహదారి పక్కన బాంబు పేలడం వల్ల.. ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్టు సమాచారం. బలూచిస్థాన్​లోని ఓ రహదారిపై భవన నిర్మాణ కార్మికులు వాహనంలో వెళ్తుండగా ఈ పేలుడు జరిగినట్టు అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: విశ్వాస పరీక్షలో నెగ్గిన ఇమ్రాన్​ ప్రభుత్వం

ఎలా జరిగిందంటే.?

పంజాబ్​(పాక్​)కు చెందిన పైప్​లైన్​ కార్మికులు.. బలూచిస్థాన్​ తాందోరిలోని ఓ​ ప్రాజెక్ట్​లో పని చేసేందుకు వాహనంలో బయల్దేరారు. ఈ క్రమంలో సిబీ టౌన్​కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. పేలుడు జరిగింది. రహదారి పక్కన ఏర్పాటు చేసిన బాంబుపై నుంచి వాహనం వెళ్లడం వల్ల ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఈ దాడికి ఎవరూ బాధ్యత వహించలేదని స్థానిక డిప్యూటీ కమిషనర్​ సయ్యద్​ జాహిద్​ షా చెప్పారు. సిబీ, తాందోరి నుంచి వచ్చిన కొందరు ఉగ్రవాదులే రిమోట్​ కంట్రోల్​ సాయంతో ఈ దురాగతానికి పాల్పడి ఉంటారని చెప్పారు.

దాడికి కారకులైన వారిని పట్టుకునేందుకు.. ఘటనా ప్రాంతంలో భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి.

ఇదీ చదవండి: సోమాలియాలో బాంబు దాడి- 20మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.