ETV Bharat / international

అమ్మో కిమ్మో.. ఈ అనూహ్య మార్పులేంటయా! - కిమ్​ ఆరోగ్యం

కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. ఆయనకు సంబంధించిన ఏ వార్త అయినా.. సంచలనమే. అసలు ఆయన ఏం చేసినా వార్తే.. ఆయన్ను ద్వేషించే అమెరికాలోని పత్రికల్లో సైతం పతాక శీర్షికల్లో కిమ్‌ తరచూ దర్శనమిస్తుంటారు. అయితే ఈ మధ్య ఈ యువ నియంతలో అనూహ్య మార్పులు వచ్చాయి. అసలు ఆ మార్పులేంటి? వాటి వెనుక కారణాలేంటి?

kim jong un
అమ్మో కిమ్మో.. ఈ అనూహ్య మార్పులేంటయా!
author img

By

Published : Jan 9, 2021, 1:33 PM IST

"పక్కవాళ్ల గురించి ఆలోచించడం ఎప్పుడు మొదలుపెట్టారు సర్..? ఇదే సర్​ మార్పంటే..

మీరు మారిపోయారు సర్​.. మారిపోయారు అంతే..!"

ఇది ఓ చిత్రంలో హిట్ డైలాగ్​.. అయితే ఈ మాటలు ప్రస్తుతం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​కు సరిగ్గా సరిపోతాయి. ఎందుకు అంటారా? మరి జీవితంలో ఎప్పుడు లేనంత వింతగా ప్రవర్తిస్తున్నారు కిమ్.

ఒకప్పుడు కిమ్​ను చూస్తే 'అమ్మో కిమ్మో' అనేవాళ్లు. ఆయన పేరు వినగానే దేశ ప్రజలను తన అదుపాజ్ఞల్లో బంధించే నియంతృత్వ వైఖరి, అమెరికా వంటి అగ్రదేశానికే హెచ్చరికలు పంపే మేకపోతు గాంభీర్యం కళ్లముందు కదలాడతాయి. ఆయన క్రూరత్వం గురించి తెలియాలంటే ఈ ఒక్క సంఘటన చాలు.

అధికారం చేపట్టేనాటికి కిమ్‌ ఉన్‌ వయసు 27 ఏళ్లు. వయసులో చిన్నే కానీ హింసా ప్రవృత్తిలో ఆయన్ను మించిన వారుండరేమో. ఎంతగా అంటే తన తండ్రి మరణించినందుకు ఆ దేశ ప్రజలందరూ తీవ్రంగా బాధపడాలని కిమ్ ఆదేశించారు. సైనికుల్ని నియమించి కన్నీళ్లు కార్చని వారినీ తండ్రి సంతాప కార్యక్రమాలకు హాజరుకాని ప్రజలనూ బంధించి ఆరునెలల జైలు శిక్ష వేశారు.

kim jong un
కన్నీరు పెట్టిన కిమ్

అలాంటి కిమ్​ ఈ మధ్య కన్నీరు కార్చడమేంటి? దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పడమేంటి? ఇలా కిమ్​లో ఒకటా రెండా ఎన్నో మార్పులను ఇటీవల ప్రపంచ దేశాలు గమనించాయి. అయితే అందిరిని తొలిచేస్తోన్న ప్రశ్న మాత్రం ఒక్కటే.. కిమ్​లో మార్పులకు కారణమేంటి?

ఎంత మారిపోయారు?

  • అధికార వర్కర్స్‌ పార్టీ 75వ వార్షికోత్సవం సందర్భంగా మిలిటరీ పరేడ్‌ను ఉద్దేశించి ప్రసంగించిన కిమ్‌ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కరోనా వైరస్‌ సంక్షోభ సమయంలో దేశాన్ని మార్గనిర్దేశం చేయడంలో తాను విఫలమయ్యానంటూ కిమ్‌ కన్నీరు పెట్టుకున్నారు.

"ఈ దేశ ప్రజలు నాపై ఎంతో నమ్మకం ఉంచారు. కానీ నేను వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాను. అందుకు నన్ను క్షమించండి. గ్రేట్ కామ్రేడ్స్‌ కిమ్-ఇల్-సంగ్, కిమ్-జోంగ్-ఇల్ నుంచి ఈ దేశాన్ని నడిపించే బాధ్యతను తీసుకున్నప్పటి నుంచి ప్రజలు నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. మా ప్రయత్నాలు, చిత్తశుద్ధి ప్రజల జీవితంలోని కష్టాలను తొలగించడానికి సరిపోలేదు"

- కిమ్ జోంగ్ ఉన్

"మన దేశ ప్రజల ఆశయాలు, కోరికలు నిజరూపం దాల్చేందుకు, కొత్త శకాన్ని ఆరంభించేందుకు నేను ఈ నూతన సంవత్సరంలోనూ మరింత కృషి చేస్తాను. క్లిష్ట సమయాల్లోనూ నాపై తిరుగులేని నమ్మకం ఉంచి, మా పార్టీ వెంట నిలిచిన ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను"

- కిమ్​ జోంగ్ ఉన్

"2016లో కాంగ్రెస్​ నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాలు చేరుకోలేదు.. భవిష్యత్తులో దీనిని పునరావృత్తం చేయకూడదు. సరికొత్త అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకుని తగిన ప్రణాళికలను అమలు చేస్తాం."

- కిమ్​ జోంగ్ ఉన్

తరుచుగా..

గత ఏడాది జరిగిన కిమ్‌ II సంగ్‌ జయంతి వేడుకలకు కిమ్‌ గైర్హాజరు అయ్యారు. దేశంలోనే అతిపెద్ద వేడుకగా జరుపుకొనే ఇంత ముఖ్య కార్యక్రమానికి ఆయన హాజరుకాకపోవడంపై అనేక ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆయనకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగిందనే వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల కిమ్​ తరచుగా మీడియా ముందుకు వస్తున్నారు. పలు అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే కిమ్​.. తన ఆరోగ్యం సరిగానే ఉందనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

కారణమేంటి..?

కిమ్​లో ఈ మార్పులన్నీ ఆయన అదృశ్యమైనట్లు వార్తలు వచ్చిన తర్వాత జరిగినవే కావడం గమనార్హం. మరి ఆయనలో ఇంత మార్పునకు కారణాలేంటి?

  1. కిమ్​లో మార్పులకు ఆయన పాలనపై పెరిగిన ఒత్తిడే నిదర్శనమంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తన నాయకత్వంపై కిమ్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని వారు అంటున్నారు.
  2. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన దేశాన్ని గాడిన పెట్టాలంటే ఇతర దేశాలతో సఖ్యతగా వ్యవహరించడం ముఖ్యమనే విషయాన్ని కిమ్​ అర్థం చేసుకొని ఉంటారని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు.

అమెరికాతో మాత్రం..

అయితే అమెరికా గురించి ఇటీవల మౌనంగా ఉన్న కిమ్​ తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలు సామర్థ్యాన్ని పెంచుకుంటామని అమెరికాకు హెచ్చరికలు జారీ చేశారు కిమ్​. ఉత్తరకొరియాపై అనుసరిస్తున్న కఠిన వైఖరిని అమెరికా మార్చుకునే విషయంపైనే ఇరు దేశాల మధ్య మైత్రి ఆధారపడి ఉంటుందని తేల్చిచెప్పారు. అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న బైడెన్​పై ఒత్తిడి పెంచేందుకే ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.