హాంకాంగ్లో.. నేరస్థులను చైనాకు అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు మిన్నంటుతున్నాయి. పది వారాలుగా జరుగుతున్న ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు మంగళవారం కూడా హాంకాంగ్ విమానాశ్రయాన్ని స్తంభింపజేశారు. ఫలితంగా వందలాది విమానాలను అధికారులు రద్దు చేశారు.
నగర నాయకుడి హెచ్చరికలను ధిక్కరించిన నిరసనకారులు వెనుదిరిగేది లేదని స్పష్టం చేశారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు పెప్పర్ స్ప్రే ఉపయోగించారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదనే నెపంతోనే పోలీసులు ఈ చర్యకు దిగారు. ఇద్దరు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
హాంకాంగ్ సరిహద్దులకు చైనా దళాలు
హాంకాంగ్లో ఉద్ధృతంగా జరుగుతున్న నిరసనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. హాంకాంగ్ సరిహద్దులకు చైనా దళాలు చేరుకుంటున్నాయని ట్వీట్ చేశారు.
"చైనా ప్రభుత్వం హాంగ్‌కాంగ్ సరిహద్దులకు దళాలను తరలిస్తున్నట్లు మా ఇంటెలిజెన్స్ తెలియజేసింది. అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉండాలి!"
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ట్వీట్
ఇదీ చూడండి: 'జియో ఫస్ట్ డే-ఫస్ట్ షో వచ్చినా... మా సినిమానే హిట్'