హాంగ్‌కాంగ్‌లో ఆందోళనకారులు వినూత్నంగా నిరసన తెలిపారు. పోలీసులపై లేజర్ లైట్లు ప్రదర్శించారు. తుపాకులకు ఉండే లక్ష్య ఛేదన లైట్లుగా భావించిన అధికారులు... ఫ్లడ్లైటుతో ఎదుర్కునేందుకు ప్రయత్నించారు. నిరసనకారులు వెనక్కి తగ్గాలని మైకుల్లో హెచ్చరించారు.
ఆందోళనలను విరమించాలని ప్రభుత్వ అనుకూల వర్గం విక్టోరియా హార్బర్ వద్ద ర్యాలీ తీసింది.
నేరస్తులను చైనాకు అప్పగించే బిల్లుపై... ప్రభుత్వానికి, హాంగ్‌కాంగ్ వాసులకు మధ్య రాజకీయంగా విభేదాలు తలెత్తాయి. ఈ బిల్లుకు వ్యతిరేకంగా హాంగ్కాగ్ వ్యాప్తంగా రెండున్నర నెలలుగా నిరసనలు కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి:రాజస్థాన్ వరదలు: కోటా, సీకర్ జలదిగ్బంధం