యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న శుభవార్తను రష్యా అందించింది. తాము అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్ చేసినట్టు ప్రకటించారు ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ టీకా ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. టీకాను పరీక్షించిన వారిలో తన కుమార్తె కూడా ఉన్నట్టు తెలిపిన పుతిన్.. ఆమె ఆరోగ్యంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు పరీక్షల్లో తేలిందని పుతిన్ పేర్కొన్నారు. కరోనా వైరస్ నుంచి శాశ్వత రోగనిరోధక శక్తిని ఈ టీకా అందిస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రజలకు విడుదల చేసేందుకు కావాల్సిన పరీక్షలన్నీ ఈ వ్యాక్సిన్‌పై జరిపినట్టు పేర్కొన్నారు రష్యా అధ్యక్షుడు.
పంపిణీలో భాగంగా తొలుత ఈ టీకాను ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, వైరస్ ప్రమాదం అధికంగా పొంచి ఉన్న వారికి అందివ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు.
అయితే ఈ వ్యాక్సిన్‌పై రష్యాలోని పలువురు శాస్త్రవేత్తలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడో దశ ట్రయల్స్ జరగకముందే వ్యాక్సిన్‌ను ఎలా రిజిస్ట్రర్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు.