రేప్ కేసుల్లో దోషులకు లైంగిక సామర్థ్యం లేకుండా చేసే 'నేర చట్టం(సవరణ)-2021' బిల్లుపై పాకిస్థాన్ వెనక్కు తగ్గింది. ఈ చట్టం.. ఇస్లామిక్ పద్ధతులకు వ్యతిరేకంగా ఉందని అంతర్జాతీయ ఇస్లామిక్ కౌన్సిల్(సీఐఐ) స్పష్టం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ చట్టంలో ఉన్న కెమికల్ 'కాస్ట్రేషన్' క్లాస్‌ను తొలగించినట్లు పార్లమెంటరీ న్యాయ కార్యదర్శి జస్టిస్ మలీకా బొకారీ తెలిపారు. ఈ చట్టంలోని అంశాలు ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్నాయని అంతర్జాతీయ ఇస్లామిక్ కౌన్సిల్ స్పష్టం చేయటం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. న్యాయశాఖ మంత్రి ఫరోగ్ నాసిమ్ ఆధ్వర్యంలో చర్చలు జరిపాకే కెమికల్ 'కాస్ట్రేషన్' అంశాన్ని చట్టం నుంచి తొలగించామన్నారు.
రేప్ కేసు దోషులకు లైంగిక సామర్థ్యం తొలగించే ప్రక్రియను 'కెమికల్ కాస్ట్రేషన్'గా పిలుస్తారు(chemical castration law pakistan). వైద్యులు డ్రగ్స్‌ను ఉపయోగించి అత్యాచార దోషులు శృంగారానికి పనికిరాకుండా చేస్తారు. దక్షిణ కొరియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్ సహా అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ శిక్ష అమల్లో ఉంది.
పాకిస్థాన్‌లో(pakisthan news latest) నమోదయ్యే రేప్ కేసుల్లో 4 శాతం నిందితులు మాత్రమే దోషులుగా తేలుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
ఇస్లాంకు వ్యతిరేకం..
అయితే రేపిస్టులకు కెమికల్ కాస్ట్రేషన్ శిక్ష(chemical castration pakisthan) విధించడం సరికాదని జమాత్-ఎ-ఇస్లామి సెనేటర్ ముస్తాక్ అహ్మద్ నిరసన వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఇస్లాంకు, షరియా చట్టానికి వ్యతిరేకమన్నారు. రేప్ కేసు దోషులను బహిరంగంగా ఉరితీయడం సరైందేనని, కానీ షరియా చట్టంలో కెమికల్ కాస్ట్రేషన్ శిక్ష ప్రస్తావన ఎక్కడా లేదని వాదించారు.