ETV Bharat / international

పాక్​ చేతికి అఫ్గాన్​లోని అమెరికా ఆయుధాలు- భారత్​లో విధ్వంసానికేనా? - పాక్​ చేతికి అమెరికా ఆయుధాలు

అమెరికా బలగాలు అఫ్గానిస్థాన్​ను వీడుతూ భారీగా అధునాతన ఆయుధాలను(us military weapons used in afghanistan) వదిలేసి వెళ్లాయి. వాటిని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు పాకిస్థాన్​కు విక్రయిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఆ ఆయుధాలను భారత్​లో విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్​ఐ కనుసన్నల్లోని ఉగ్రసంస్థలకు అప్పగించే అవకాశం లేకపోలేదని పేర్కొన్నాయి.

US military weapons in Afghanistan
పాక్​ చేతికి అఫ్గాన్​లోని అమెరికా ఆయుధాలు
author img

By

Published : Nov 11, 2021, 11:28 AM IST

అఫ్గానిస్థాన్​లో ఉగ్రమూకల ఏరివేత కోసం రెండు దశాబ్దాల పాటు పోరాటం సాగించి.. ఈ ఏడాది ఆగస్టులో బలగాల ఉపసంహరణ పూర్తి చేసింది అమెరికా. భారీగా ఆయుధ సంపత్తిని అఫ్గాన్​లోనే వదిలేసి (us military weapons used in afghanistan) బలగాలను తరలించినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఇప్పుడు ఆ ఆయుధాలను చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది పాకిస్థాన్​. అగ్రరాజ్యానికి చెందిన అధునాతన ఆయుధాలను అఫ్గానిస్థాన్​ నుంచి పాకిస్థాన్​ కొనుగోలు చేసినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఆ ఆయుధాలు తెహ్రీక్​ ఈ తాలిబన్​ పాకిస్థాన్​ చేతికి వెళతాయనే ఆందోళన వ్యక్తం చేసింది. ఇమ్రాన్​ ప్రభుత్వం, నిషేధిత ఉగ్ర సంస్థ మధ్య ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది.

ఈ ఏడాది ఆగస్టులో కాబుల్​ను తాలిబన్లు(Afghanistan Taliban) సొంతం చేసుకున్న తర్వాత.. అఫ్గాన్​ ఆర్మీ(Afghan Army) నుంచి భారీగా అమెరికా ఆయుధాలను స్వాధీనం చేసుకుని పాకిస్థాన్​కు సరఫరా చేసినట్లు ద న్యూయార్క్​ టైమ్స్​ గత నెలలో వెల్లడించింది. అలాగే.. అఫ్గాన్​ గన్​ డీలర్స్​ అమెరికా ఆయుధాలను నేరుగా దుకాణాల్లోనే విక్రయాలు జరుపుతున్నట్లు పేర్కొంది.

అయితే.. బలగాల ఉపసంహరణ పూర్తయ్యేలోపే అధునాతన ఆయుధాలను ధ్వంసం చేసినట్లు పెంటగాన్​ తెలిపింది. ఈ నేపథ్యంలోనే.. వేలాది ఆయుధాలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నట్లు న్యూయార్క్​ టైమ్స్​ పేర్కొంది.

భారత్​లో విధ్వంసానికి..

అఫ్గాన్​ నుంచి కొనుగోలు చేస్తున్న అమెరికా ఆయుధాలను (us military weapons used in afghanistan) తొలుత పాకిస్థాన్​లోనే విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్​ఐ కనుసన్నల్లోని ఉగ్ర సంస్థలు వినియోగిస్తాయని భావిస్తున్నట్లు పేర్కొంది భారత్​. ఆ తర్వాత భారత్​పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. భారత్​లోని ఉగ్రవాద సంస్థలకు ఆ ఆయుధాలను అందిస్తారని భావిస్తున్నామని, అయితే.. ఇక్కడ వాటిని వినియోగించేందుకు చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని తెలిపారు సీనియర్​ సైన్యాధికారులు. 'అమెరికాకు చెందిన ఆయుధాలు, ముఖ్యంగా చిన్న సామగ్రి పాకిస్థాన్​కు తరలినట్లు మాకు సమాచారం అందింది. అయితే.. తాలిబన్ల విజయంతో పాక్​లోని ఉగ్ర ముఠాలకు ధైర్యమొచ్చింది. ఆ ఆయుధాలను పాక్​లోనే తొలుత ఉపయోగించే అవకాశం ఉంది.' అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'రష్యా, చైనా చేతికి అఫ్గాన్​లోని అమెరికా ఆయుధాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.