ETV Bharat / international

అవినీతి, హింస మధ్య పీఓకేలో ఇమ్రాన్​ పార్టీ గెలుపు! - పీఓకే అసెంబ్లీ ఎన్నికలు

పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇమ్రాన్​ ఖాన్​ పార్టీకే మెజారిటీ దక్కినట్లు స్థానిక మీడియా సమాచారం. తెహ్రీక్​-ఏ-ఇన్సాఫ్​ పార్టీ మొత్తం 23 స్థానాలు గెలిచిందంటూ అక్కడి మీడియా వెల్లడించింది. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్​ జరిగిందంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. అక్కడక్కడ జరిగిన హింసాత్మక ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు.

tehreek e insaf wins pok elections, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్
పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో ఇమ్రాన్​ ఖాన్​ ప్రభుత్వానికే పట్టం!
author img

By

Published : Jul 26, 2021, 3:56 PM IST

పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​కు చెందిన తెహ్రీక్​-ఏ-ఇన్సాఫ్​ పార్టీనే (పీటీఐ) పైచేయి సాధించినట్టు తెలుస్తోంది. అనధికారికంగా వెల్లడైన వివరాల ప్రకారం ఇమ్రాన్​ ఖాన్​ పార్టీ.. 23 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది. పాకిస్థాన్​ పీపుల్స్​ పార్టీ (పీపీపీ) 8 స్థానాలు, పాకిస్థాన్​ ముస్లిం లీగ్​ నవాజ్​ (పీఎంఎల్​-ఎన్​) 6 స్థానాలలో గెలిచాయి. ముస్లిం కాన్ఫరెన్స్​ (ఎంసీ), జమ్ము కశ్మీర్​ పీపుల్స్​ పార్టీ (జేకేపీపీ)లు చెరో స్థానం సంపాదించాయి. అవినీతి, హింస వంటి ఆరోపణల మధ్య ఈ ఎన్నికలు జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంటోంది.

తెహ్రీక్​-ఏ-ఇన్సాఫ్​ పార్టీ 25 స్థానాలు గెలిచిందంటూ మరో వార్త సంస్థ జియో టీవీ వార్తలు ప్రసారం చేసింది. ఈ రెండింటిలో అధికారిక సంఖ్య ఏదైనా.. పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇమ్రాన్​ ఖాన్​ పార్టీ తగిన మెజారిటీని సంపాదించిన విషయం స్పష్టమవుతోంది.

పాకిస్థాన్​లో ఏ పార్టీ అధికారంలో ఉంటే అదే పార్టీ పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో నెగ్గుతూ రావడం ఆనవాయితీగా వస్తోంది. పీఓకే ప్రధానిగా సుల్తాన్​ మహమ్మద్​ చౌదరి ఎన్నికయ్యే అవకాశం ఉంది.

రిగ్గింగ్​.. హింస..

ఎన్నికల్లో రిగ్గింగ్​ జరిగిందని ఆరోపించాయి ప్రతిపక్ష పార్టీలు. అధికార పార్టీ కార్యకర్తలు తమ మీద దాడులు కూడా చేశారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.

స్థానిక మీడియా సమాచారం ప్రకారం.. ఎన్నికల నేపథ్యంలో పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో పలు హింసాత్మక ఘటనలు జరిగాయి. కొట్లి జిల్లా ఛార్​హోయ్​లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు తెహ్రీక్​-ఏ-ఇన్సాఫ్​ పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. అదే ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో నలుగురు సైనికులు మృతిచెందగా.. మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఝేలం లోయలో జరిగిన మరో ఘటనలో ఐదుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.

'భారత్​ సాయం కోరతాను'

పీఓకే​ ఎన్నికల సందర్భంగా ఓ ప్రతిపక్ష నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు న్యాయం జరగకపోతే భారత్​ సాయం కోరతాను అంటూ అక్కడి అధికారులను హెచ్చరించారు. పీఎంల్​-ఎన్​ నేత చౌదరి మహమ్మద్​ ఇస్మాయల్​ గుజ్జర్​ చేసిన ఈ వ్యాఖ్యలతో అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది. అయితే ఈ వివాదంపై గుజ్జర్​ స్పష్టత ఇచ్చారు. పోలింగ్​ కేంద్రాల్లో తమ ఏజెంట్ల తొలగింపునకు గల కారణంపై స్పష్టత కోసమే ఈ వ్యాఖ్యలు చేశానని వెల్లడించారు.

పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో 53 స్థానాలు ఉండగా.. 45 స్థానాల్లో మాత్రమే నేరుగా ఎన్నుకుంటారు. మిగతా స్థానాల్లో ఐదు మహిళలకు, మరో మూడు సాంకేతిక నిపుణులుకు కేటాయించారు. 45 స్థానాల్లో 33 స్థానాలకు స్థానికులు, 12 స్థానాలకు శరణార్థులు అభ్యర్థులుగా ఉంటారు. ఈ శరణార్థులు అందరూ కొన్నేళ్ల క్రితం కశ్మీర్​ నుంచి పాకిస్థాన్​కు వలస వెళ్లి అక్కడ స్థిరపడిన వారే.

పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని గిల్గిత్​-బాల్టిస్థాన్​లో ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్నట్లు భారత్​ ఇదివరకే ప్రకటించింది. ఎన్నికలు జరిపేందుకు చట్ట పరంగా పాక్​కు ఎలాంటి అనుమతులు లేవని పేర్కొంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.