జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయటంపై పాకిస్థాన్ ప్రభుత్వంతో పాటు అక్కడి విపక్షాలు కూడా అక్కసు వెళ్లగక్కుతున్నాయి. అయితే కశ్మీర్ అంశంలో పాక్ ప్రభుత్వంపైనా విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ.. ఇమ్రాన్ ప్రభుత్వం సమర్థతను ప్రశ్నించారు. ప్రభుత్వం అనుసరిస్తోన్న బలహీన విధానాలపైనా బుట్టో మండిపడ్డారు.
"గతంలో పాకిస్థాన్ శ్రీనగర్‌ను స్వాధీనం చేసుకోవడం గురించి మాట్లాడేది. కానీ ఇప్పుడు ముజఫరాబాద్(పీఓకే రాజధాని)ను కాపాడుకోవడమే పెద్ద విషయంగా కనిపిస్తోంది."
-బిలావల్ భుట్టో, పీపీపీ ఛైర్మన్
జీ7 సదస్సులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కశ్మీర్ అంశంపై చర్చలు జరిపారు. అది ద్వైపాక్షిక అంశమని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లోని విపక్షాలు అక్కడి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి.
ఆర్టికల్ 370, జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు భారత్ అంతర్గత వ్యవహారమని, పాక్‌తో చర్చించేదేమన్నా ఉంటే అది పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించే ఉంటుందని కొద్ది రోజుల క్రితమే తేల్చి చెప్పారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.
ఇదీ చూడండి: హై అలర్ట్: భారత్‌పై దాడులకు పాక్ కుట్ర..!