పొరుగు దేశం పాకిస్థాన్ మళ్లీ పాత పాటే పాడింది. పుల్వామా దాడి అనంతరం భారత సైన్యం తమ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చలేదని బుకాయిస్తూనే... 2016లో లక్షిత దాడులూ జరగలేదని ఆరోపించింది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం అంగీకరించక తప్పదని వ్యాఖ్యానించింది.
బాలాకోట్‌లో భారత వాయుసేన జరిపిన దాడుల్లో పాక్ పౌరులు, సైన్యానికి ఎలాంటి హాని జరగలేదని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పునరుద్ఘాటించిన కొద్ది గంటలకే 2016లో లక్షిత దాడుల జరగలేదని పాక్ సైన్యం ప్రతినిధి వ్యాఖ్యానించారు.
"2016 లక్షిత దాడులు, ఎఫ్-16 విమానం కూల్చామన్న భారత్ ప్రకటనలు అబద్ధాలే. ఆలస్యమైనప్పటికీ భారత ప్రభుత్వం ఈ విషయాన్ని అంగీకరించాల్సిందే."
--- ఆసిఫ్ గఫూర్, పాక్ మేజర్ జనరల్.
ఇదీ చూడండి: మేఘన్ మార్కెల్ భారత్‌లో ఏం చేశారో తెలుసా?