ETV Bharat / international

రహదారిపై పేలిన బాంబు- ఆరుగురు పౌరులు మృతి - రహదారి బాంబు ప్రమాదం

అఫ్గానిస్థాన్​లో ఘోర ప్రమాదం సంభవించింది. రహదారిపై ప్రయాణిస్తోన్న ఓ వాహనం.. రోడ్డుపై పడిఉన్న బాంబును ఢీ కొట్టడంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు పౌరులు మృతి చెందారు.

Roadside bomb kills 6 Afghan civilians in east
రహదారిపై పేలిన బాంబు- ఆరుగురు పౌరులు మృతి
author img

By

Published : Jul 12, 2020, 5:18 AM IST

అఫ్గానిస్థాన్- కాబుల్​లో బాంబు పేలిన ఘటనలో ఆరుగురు పౌరులు మరణించారు. వీరిలో ఓ మహిళ, చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.

తూర్పు అఫ్గాన్​లో రహదారిపై ప్రయాణిస్తోన్న ఓ వాహనం రోడ్డు పక్కనే పడిఉన్న బాంబును ఢీ కొనడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. ఘాజ్ని రాష్ట్రానికి చెందిన తాలిబన్​ తిరుగుబాటుదారులే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని ఆ రాష్ట్ర గవర్నర్​ వాహిదుల్లా జమజదా అనుమానం వ్యక్తం చేశారు.

గతంలోనూ..

గత బుధవారం కూడా తాలిబన్​ తిరుగుబాటుదారులు దయాక్​ జిల్లాలో ఇలాంటి తరహా దాడులు జరిపారు. ఈ ప్రమాదంలో జిల్లా పోలీస్​ అధికారి సహా ఆయన అంగరక్షకులు ఇద్దరూ మరణించారు. ఈ ఘటనపై స్పందించిన అఫ్గాన్​ రక్షణ మంత్రిత్వ శాఖ.. తూర్పు లోగర్​ రాష్ట్రంలో తాలిబన్​ దాడులను అఫ్గాన్​ సైనిక బలగాలు తిప్పికొట్టాయని తెలిపింది. ఈ దాడిలో ఎనిమిది మంది తాలిబన్​లు చనిపోగా, మరో నలుగురు గాయపడ్డారు.

ఇదీ చదవండి: 'కజఖిస్థాన్​లోని ఆ కొత్త వ్యాధి కరోనానే కావొచ్చు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.