ETV Bharat / international

భారత​ ప్రయాణికులపై న్యూజిలాండ్ తాత్కాలిక​ నిషేధం!

భారత్​ నుంచి వచ్చే ప్రయాణికులపై న్యూజిలాండ్​ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. భారత్​ కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

New Zealand PM Jacinda Ardern
భారత్​ ప్రయాణికులపై న్యూజిలాండ్​ నిషేధం!
author img

By

Published : Apr 8, 2021, 9:44 AM IST

Updated : Apr 8, 2021, 10:00 AM IST

భారత్​లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది న్యూజిలాండ్​ ప్రభుత్వం. భారత ప్రయాణికుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈనెల 11 నుంచి 28 వరకు ఈ సస్పెన్షన్​ కొనసాగనుందని తెలిపింది. ఇటీవల ఇండియా నుంచి వచ్చిన 23 మందిలో 17 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయిన క్రమంలో ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ దేశ ప్రధానమంత్రి జెసిండా ఆర్నెర్డ్​ తెలిపారు.

కొవిడ్​ హాట్​స్పాట్​లుగా ఉన్న దేశాల పరిస్థితులను తమ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందన్నారు ప్రధాని ఆర్నెర్డ్​. వైరస్​ కట్టడికి ప్రయాణాలను నిలిపివేయటం తాత్కాలిక చర్యే అని పేర్కొన్నారు. కాగా న్యూజిలాండ్​లో వైరస్​ బాధితుల సంఖ్య 2,531కి చేరింది.

భారత్​లో రోజువారి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే.. 1,15,736‬ మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

ఇదీ చూడండి:ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​తో రక్తం గడ్డ కట్టొచ్చు!

Last Updated : Apr 8, 2021, 10:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.