ETV Bharat / international

అనుచిత సంబంధం కేసులో మంత్రిపై ప్రధాని వేటు

author img

By

Published : Jul 23, 2020, 11:29 AM IST

తప్పు చేస్తే సొంత కార్యవర్గంలోని మంత్రులను సైతం విడిచిపెట్టలేదు న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్. కొంతకాలంగా ఓ మహిళతో అనుచిత సంబంధం కలిగి ఉన్నందుకు ఇమ్మిగ్రేషన్ మంత్రిని పదవి నుంచి తప్పించారు. పార్లమెంట్ వాతావరణం మరింత మెరుగుపడాలని ఆకాంక్షించారు.

New Zealand minister fired for improper affair with staffer
జసిండా ఆర్డెర్న్

సహోద్యోగితో అనుచిత సంబంధం కలిగి ఉన్నందుకు ఇమ్మిగ్రేషన్ మంత్రిపై న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ వేటు వేశారు. ఈ విషయాన్ని స్వయంగా జసిండా ప్రకటించారు. మంత్రి ఇయాన్ లీస్​ గాలోవే.. అతని కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళతో సంవత్సరం నుంచి సంబంధం కలిగి ఉన్నారని జసిండా పేర్కొన్నారు.

గాలోవే ఇదివరకు పర్యవేక్షించిన విభాగంలోనే మహిళ తొలుత ఉద్యోగం సంపాదించిందని, అనంతరం ఇప్పుడున్న కార్యాలయంలోకి మారిందని ఆర్డెర్న్ తెలిపారు. మంత్రిపై నైతికాభిప్రాయానికి వచ్చేందుకు కాస్త జాగ్రత్తపడినట్లు తెలిపారు. అయితే గాలోవే స్వయంగా ఆరోపణలపై స్పందించినట్లు తెలిపారు. అధికారాలను దుర్వినియోగం చేసినట్లు ఆయన ఒప్పుకున్నట్లు స్పష్టం చేశారు.

"మంగళవారం మధ్యాహ్నం ఈ ఆరోపణల గురించి నాకు తెలిసింది. ఈ ఆరోపణల గురించి లీస్ గాలోవేను సాయంత్రం అడిగాను. గాలోవే చర్యలు మంత్రిగా ఆయనపై నా విశ్వాసాన్ని కోల్పోయేలా చేశాయి."

-జసిండా ఆర్డెర్న్, న్యూజిలాండ్ ప్రధాని

అయితే వీరి మధ్య సంబంధం కొద్ది నెలల క్రితం ముగిసిపోయినట్లు ఆర్డెర్న్ పేర్కొన్నారు.

'క్షమించండి..!'

మరోవైపు ప్రధాని జసిండా నిర్ణయాన్ని లీస్ గాలోవే సమ్మతించారు. ఈ విషయంపై క్షమాపణలు కోరారు. సెప్టెంబర్​లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు.

"నా స్థానంలో పూర్తి అనుచితంగా వ్యవహరించాను. మంత్రిగా నేను కొనసాగలేను."

-లీస్ గాలోవే, మాజీ మంత్రి

అంతకుముందు మరొకటి!

ఈ ఘటనకు ఒక రోజు ముందు విపక్ష నేత ఆండ్రూ ఫాలూన్ ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఓ యూనివర్సిటీ విద్యార్థి సహా కొంతమంది మహిళలకు అసభ్య చిత్రాలు పంపించారానే ఆరోపణల మధ్య ఫాలూన్ రాజీనామా సమర్పించారు. ఆరోపణలపై ఫాలూన్ స్పష్టతనివ్వలేదు. అయితే తాను చేసిన తప్పులకు క్షమాపణ కోరారు. ప్రస్తుతం మానసిక చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఈ ఆరోపణల్లో రాజకీయ కోణాలు ఏవైనా ఉన్నాయేమో అనే అనుమానంతో ఈ రెండు ఘటనలకు సంబంధించిన వివరాలను తొలుత ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతలకు పంపించినట్లు సమాచారం.

పార్లమెంట్ మెరుగుపడాల్సిందే

అయితే పార్లమెంట్​లో ఇదివరకు పరిస్థితులు కొనసాగే అవకాశం లేదని తాజా ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. పార్లమెంట్​ వాతావరణం, సంస్కృతి మరింత మెరుగుపడాల్సి ఉందని ప్రధాని జసిండా అభిప్రాయం వ్యక్తం చేశారు.

"ఇక్కడి వాతావరణంలో సరైన ప్రమాణాలు ఉండేలా చూడటంలో మనందరి పాత్ర కీలకం. నిర్దిష్ట జెండర్​ వ్యక్తులపై నేను అభిప్రాయం చెప్పడం లేదు."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.