ETV Bharat / international

ఇకపై 20 నిమిషాల్లోనే కరోనా పరీక్ష ఫలితం - COVID-19 rapid test

20 నిమిషాల్లో కరోనా పరీక్ష ఫలితం వచ్చేలా నాసల్​ స్వాబ్​ టెస్టును రూపొందించారు మెల్​బోర్న్​ శాస్త్రవేత్తలు. ఎన్​1 స్టాప్​ ల్యాంప్​ అని పిలిచే ఈ టెస్టు తక్కువ ఖర్చుతో కూడుకున్నదని వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను జర్నల్​ ఆఫ్​ మెడికల్​ మైక్రోబయాలజీలో ప్రచురించారు.

New low-cost test can diagnose COVID-19 in just 20 minutes
ఇకపై 20 నిమిషాల్లోనే కరోనా పరీక్ష ఫలితం
author img

By

Published : Aug 14, 2020, 4:12 PM IST

ప్రపంచ దేశాలపై కరోనా పంజా విసురుతోంది. కరోనా బాధితులకు గుర్తించేందుకు చేసే పరీక్షల ఫలితం రావటానికి రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతోంది. ఈ తరుణంలో తక్కువ ఖర్చుతో, కేవలం 20 నిమిషాల్లో కచ్చితత్వంతో కూడిన ఫలితాలను ఇచ్చే నాసల్​ స్వాబ్​ టెస్టును రూపొందించారు మెల్​బోర్న్​ శాస్త్రవేత్తలు. ఎన్​1 స్టాప్​-ల్యాంప్​ అని పిలిచే టెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు జర్నల్ ఆఫ్ మెడికల్ మైక్రోబయాలజీలో ప్రచురించారు.

రాపిడ్​ మాలిక్యూలర్​ టెస్ట్​ను ఉపయోగించటం చాలా సులభతరమని, అత్యంత కచ్చితమైన ఫలితాలిస్తుందని వెల్లడించారు. నాసల్​ స్వాబ్​ పరీక్ష నిర్వించిన త్వరాత చిన్న పోర్టబుల్​ యంత్రం ద్వారా కరోనాను గుర్తించే విధంగా దీనిని తయారు చేశారు. ఈ కొత్త పరీక్ష కోసం ఒక ట్యూబ్‌ను మాత్రమే ఉపయోగిస్తారు. ఒకే దశను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కరోనా పరీక్ష కంటే ఎక్కువ సమర్థంగా పని చేయటమే కాకుండా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని చెప్పారు శాస్త్రవేత్తలు.

"కరోనా మహమ్మారిని నియంత్రించాలంటే వేగవంతమైన, కచ్చితత్వంతో కూడిన రోగ నిర్ధరణ పరీక్ష అవసరం. మేం ఒక ప్రత్యామ్నాయ కొవిడ్-19 మాలిక్యులర్ పరీక్షను అభివృద్ధి చేశాం. దీనిని ప్రామాణిక ప్రయోగశాలలు లేని చోటుకు కూడా తీసుకోని వెళ్లి పరీక్ష నిర్వహించవచ్చు." అని ఆస్ట్రేలియాలోని మెల్​బోర్న్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ టిమ్ స్టైనర్ తెలిపారు.

ఎన్​7 స్టాప్​ ల్యాంప్​ పద్ధతి పని తీరు తెలుసుకోవటం కోసం కరోనా పాజిటివ్​గా తేలిన 157 నమూనాలను పరీక్షించారు. వీటిలో 87 శాతం ఫలితాలు కచ్చితంగా వచ్చినట్లు పేర్కొన్నారు. 93 నమూనాల ఫలితం రావటానికి 14 నిమిషాల సమయం పట్టిందని తెలిపారు.

ఇదీ చూడండి:మోదీ రికార్డు: సుదీర్ఘ కాలం ప్రభుత్వ అధినేతగా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.