ETV Bharat / international

కరోనా భాష.. కొత్త భావాలు పలికిస్తోంది! - trending covid words

అవసరానికి మించి సరకులు తెచ్చుకుని ఇంట్లోపెట్టుకనేవారిని ఇడియట్​ అంటారు.. కానీ కరోనా కాలంలో అలా చేస్తే 'కొవిడియట్​' అంటున్నారు! ఇక బుద్ధిగా నియమాలు పాటించేవారిని ఒబిడియంట్​ కాదు.. 'కొవిడియంట్'​ అంటున్నారు! ఇక డివోర్స్​కాస్తా.. 'కొవిడివోర్స్​' అయిపోయింది. ఇంతే కాదండి.. కరోనా కాలంలో భాషలో చాలా మార్పులు వచ్చాయి... అవేంటో చూద్దాం రండి!

new funny words trending after corona virus
కరోనా భాష.. కొత్త భావాలు పలికిస్తోంది!
author img

By

Published : May 24, 2020, 7:34 AM IST

మన అలవాట్లతో పాటు ఆలోచనలను మార్చేసింది కరోనా వైరస్‌. ఐసోలేషన్ ‌(ఒంటరిగా ఉంచడం), క్వారంటైన్ ‌(నిర్బంధం), లాక్‌డౌన్‌ వంటి అనుభవాలను నేర్పింది. ఈ క్రమంలో ఔత్సాహికులు కొన్ని కొత్త పదాలను సృష్టించారు. ప్రధానంగా సామాజిక మాధ్యమాలలో నలుగుతున్న కొన్ని కొత్త పదాలివి.

కొవిడియట్‌

లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించనివారిని ఈ పేరుతో పిలుస్తున్నారు. ఊరికే రోడ్లపై తిరిగేవారు, కిరాణా దుకాణాలు, సూపర్‌ మార్కెట్లలో ఎగబడుతూ సరకులు కొని నిల్వచేసే వారిని ఇలా అంటున్నారు. చేతులు సరిగా శుభ్రం చేసుకోకున్నా, కావాలని గుంపులోకి దూరేస్తున్నా, ఇతరులకు దగ్గరగా వెళ్తున్నా.. అలాంటి వారికీ ఇదే పదం వాడేస్తున్నారు. ఇడియట్‌ అని చెప్పకనే చెబుతున్నారు.

కొవిడియంట్‌

ఒబిడియంట్‌(విధేయుడు)అని అర్థం. లాక్‌డౌన్‌ సమయంలో బుద్ధిగా మసలుకొనేవారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ, వ్యక్తిగత శుభ్రత, దూరం పాటిస్తున్న వారన్నమాట.

సొలివిగంట్‌

లాక్‌డౌన్‌ సమయంలో ఒంటరిగా రాత్రుళ్లు వీధుల్లో తిరుగుతూ కర్ఫ్యూను ఉల్లంఘించేవారు. మేము వేరే వాళ్లకు ఏం హాని చేయడం లేదు కదా అనే భావనలో ఉండేవారిని ఇలా పిలుస్తున్నారు.

హిబీ- జిబీస్‌

కరోనా తాలూకు భయం, ఆందోళనలతో గడిపేవారు. అదే పనిగా చేతులు కడుగుతుంటారు. వీరు పడే ఒత్తిడి పక్కవారికి సులువుగా తెలిసిపోతుంది. ఒక రకంగా మనలో చాలావరకు హిబీ-బిజీస్‌మే.

స్క్రిప్ట్‌రుయంట్‌

ఇంట్లోనే ఉండాల్సి రావడంతో చాలామంది సినిమాలతో కాలక్షేపం చేసుంటే కొందరు అంతర్జాలంతో కుస్తీ పడుతున్నారు. వీరికి భిన్నంగా కొందరు తోచింది రాస్తూ గడిపేస్తుంటారు. వారిని ఉద్దేశించి పెట్టిన పదమిది.

కరోనాస్పెక్‌

స్పెక్‌ అనేది జర్మనీ పదం. దీనికి ఇంగ్లీష్‌లో సమానార్థకం ఫోర్క్‌. ఒత్తిడి, ఆందోళన ఎక్కువైతే బరువు పెరుగుతారు. కరోనా కారణంగా ఆందోళన పడుతూ ఈ సమయంలో బరువు పెరుగుతున్న వారికి ఈ పదం సృష్టించేశారు.

కొవిడివోర్స్‌

కుటుంబ సభ్యులంతా ఇళ్లకే పరిమితమవుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా నగరాలలో భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయన్నది ఓ అధ్యయనం. ఈ తరుణంలో విడాకులకు మొగ్గు చూపేవారికి కొవిడివోర్స్‌ అన్న పేరు పెట్టేశారు.

రోనా

కరోనాకే సంక్షిప్త పదంగా సరదాగా వాడేస్తున్నారు.

క్వారంటిని

లాక్‌డౌన్‌ సమయంలో ఇళ్లలో మద్యం తాగుతూ గడిపేసేవారు.

ఇదీ చదవండి: 'కరోనా సోకిన గర్భిణీలకు ఆ ప్రాంతంలో గాయాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.