ETV Bharat / international

చైనా మొండి వైఖరిపై నేపాల్ వ్యాపారుల ఆందోళన

author img

By

Published : Feb 6, 2021, 7:16 PM IST

చైనాపై నేపాల్​ వ్యాపారులు మండిపడ్డారు. చైనా తమ వ్యాపారాలకు భంగం కలిగిస్తోందని ఆరోపించారు. గత కొన్ని నెలలుగా తమ సరకులు సరిహద్దులోనే నిలిచిపోయాయని.. దీనిపై చైనాను సంప్రదించినా ఎలాంటి ఫలితం లేదని తెలిపారు. చైనా ఇదే వైఖరి కొనసాగిస్తే ఆ దేశంతో వ్యాపారం చేయడం అనవసరమన్నారు.

china, nepal, trade
చైనా వైఖరిపై నేపాల్ వ్యాపారుల ఆందోళన

చైనా తమ వ్యాపారాలకు భంగం కలిగిస్తోందని నేపాల్ వ్యాపారులు ఆరోపించారు. డ్రాగన్​ అనుమతించక పోవడం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో 16 నెలలుగా తమ సరకులు నిలిచిపోయాయని వాపోతున్నారు. చైనాతో వ్యాపార స్థితిగతులపై నేపాల్​ జాతీయ వ్యాపారుల సమాఖ్య అధ్యక్షుడు నరేశ్ కతూవాల్​ శుక్రవారం ఈ విషయాలను వెల్లడించారు. చైనా వైఖరిని నిరసిస్తూ నేపాల్​ వ్యాపారులు చైనా నుంచి కొనుగోళ్లను రద్దు చేసుకున్నారు.

china, nepal, trade
సరిహద్దు వద్ద స్తంభించిన వాహనాలు

"కేరంగ్, తటోపని సరిహద్దుల వద్ద సుమారు 300 కంటెయినర్లు 16 నెలలుగా నిలిచిపోయాయి. ఈ విషయంపై ఇప్పటికే చైనాను అనేక సార్లు సంప్రదించాం. దౌత్యపరంగా ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం ఉంటుదేమోనని విదేశాంగ శాఖను కూడా సంప్రదించాం. కానీ ఎలాంటి ఫలితం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే చైనాతో వ్యాపారం చేయడం అనవసరం."

-నరేశ్​ కతూవాల్​, నేపాల్​ జాతీయ వ్యాపారుల సమాఖ్య అధ్యక్షుడు

వ్యాపారులపై చైనా​ వడ్డన..

చైనా కొన్ని నెలలుగా నేపాల్ వ్యాపారులకు సరకు రవాణాపై రాకపోకలకు అనుమతించట్లేదు. అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన లేకున్నా 16 నెలలుగా ఇదే వైఖరి కొనసాగిస్తోంది. గతేడాది అక్టోబర్​, నవంబర్​ నెలల మధ్య 2000 కంటెయినర్లు నిలిచిపోయాయి. ఇప్పటివరకు డ్రాగన్ పరిమిత సంఖ్యలోనే వాహనాలను నేపాల్​ సరిహద్దులోకి అనుమతించింది. ఇందుకు అదనంగా చైనా- నేపాల్​ సరిహద్దు ప్రాంతాల్లో సరకు రవాణాపై సుంకాన్ని పెంచింది. కంటైనరుకు 7.3 లక్షల వరకు పన్ను విధిస్తున్నారు.

తగ్గిన వ్యాపారం..

చైనాతో నేపాల్​ వ్యాపారం క్షీణించిందని స్థానిక ట్రేడ్​ యండ్​ ఎక్స్​పోర్ట్​ ప్రమోషన్​ సెంటర్​ వెల్లడించింది. ఆగునెలల్లో చైనా నుంచి దిగుమతులు 18.5 శాతం తగ్గగా, ఎగుమతులు 50 శాతం తగ్గాయని పేర్కొంది. మరమ్మతు కారణంగా ప్రస్తుతం తటోపని సరిహద్దు మార్గాన్ని రద్దు చేశారు.

ఇదీ చదవండి : అమెరికా మాతో కలిస్తే ఎంతో సాధించొచ్చు: చైనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.