ETV Bharat / international

కొత్త మ్యాప్​ ఆమోద ముద్రకు నేపాల్​ తర్జనభర్జన - నేపాల్ రాజ్యాంగ సవరణ

నూతన సరిహద్దులతో కూడిన నేపాల్​ కొత్త మ్యాప్​నకు ఆమోద ముద్ర లభించేందుకు రాజ్యంగ సవరణ చేయడానికి ఆ దేశ ప్రతినిధుల సభ భేటీ కావాలని నిర్ణయించి.. చివరి నిమిషంలో రద్దు చేసుకుంది. భారత్​తో సరిహద్దు విషయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో నేపాల్​ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే తమ ప్రతిపాదనను గట్టెక్కించుకోవడానికి ప్రభుత్వానికి ప్రతినిధుల సభలో తగిన సంఖ్యా బలం లేనట్టు తెలుస్తోంది.

Nepal to initiate constitutional amendment process today to include updated map
కొత్త మ్యాప్​ ఆమోద ముద్రకు నేపాల్​ తర్జనభర్జన
author img

By

Published : May 27, 2020, 4:19 PM IST

భారత సరిహద్దులో ఉద్రిక్తతను పెంచుతూ ఇటీవలే ఓ కొత్త మ్యాప్​ను తీసుకొచ్చింది నేపాల్​. ఇప్పుడు ఈ మ్యాప్​న​కు ఆమోద ముద్ర వేసే విషయంలో మాత్రం తర్జనభర్జన పడుతోంది. మ్యాప్​ కోసం రాజ్యాంగాన్ని సవరించేందుకు బుధవారం మధ్యాహ్నం 2గంటలకు నేపాల్​ ప్రతినిధుల సభ భేటీ కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ప్రతినిధుల సమావేశం వాయిదా పడంది.

ఏందుకీ ఉద్రిక్తత?

ఈ నెల 8న మానససరోవర్‌ యాత్ర కోసం ఉత్తరాఖండ్‌ నుంచి లిపులేఖ్​‌ పాస్‌ వరకు భారత్‌ నిర్మించిన రహదారిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. అది జరిగిన కొద్ది రోజులకు(మే 18).. లిపులేఖ్, కాలపానీ సహా లింపియాధురా ప్రాంతాలను తమ పరిధిలో ఉన్నట్లు చూపించే కొత్త మ్యాప్​కు ఆ దేశ కేబినెట్​ ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేయడానికి ఈ నెల 22న పార్లమెంట్​లో ప్రతిపాదన చేసింది.

ప్రతిపాదన గట్టెక్కుతుందా?

ఈ రాజ్యాంగ సవరణకు సభలోని మూడింట రెండో వంతు మెజారిటీ అవసరం. ఈ నేపథ్యంలో తమ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతూ మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహంచారు నేపాల్​ ప్రధాని కేపీ ఓలీ.

జాతీయ అసెంబ్లీలో నేపాల్​ కమ్యునిస్ట్​ పార్టీకి మూడింట రెండోవంతు మెజారిటీ ఉంది. కానీ దిగువ సభలో తమ ప్రతిపాదన గట్టెక్కించుకోవడానికి దాదాపు 10సీట్లు వెనకపడి ఉంది ఓలీ ప్రభుత్వం.

అయితే.. ఈ ప్రతిపాదనకు మద్దతు తెలపాలంటే.. ఎన్నోఏళ్లుగా పడి ఉన్న తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రతిపక్ష పార్టీలు ఓలీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. కొత్త మ్యాప్​నకు నేపాల్​ కాంగ్రెస్​ మద్దతునిచ్చినప్పటికీ... రాజ్యంగ సవరణకు మాత్రం అంగీకరించడం లేదు. అన్ని పార్టీలు ముందు చర్చించుకుని ఓ నిర్ణయానికి రావాలని సూచించింది.

ఇదీ చూడండి:- భారత్​కు వ్యతిరేకంగా నేపాల్​లో చైనా చిచ్చు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.