ETV Bharat / international

సూకీపై కొత్తగా క్రిమినల్​ అభియోగాలు

మయన్మార్​లోని సైనిక ప్రభుత్వం.. ఆ దేశ అగ్రనాయకురాలు ఆంగ్​సాన్​ సూకీపై తాజాగా క్రిమినల్ అభియోగాన్ని మోపింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి ఉద్దేశించిన చట్టాన్ని ఆమె ఉల్లంఘించారని ఆరోపించింది.

Aung San Suu Kyi
ఆంగ్​సాన్​ సూకీ
author img

By

Published : Apr 13, 2021, 5:44 AM IST

మయన్మార్​లో సైనిక ప్రభుత్వం తన ప్రత్యర్థులపై అణచివేతను కొనసాగిస్తోంది. న్యాయస్థానాలు, వీధుల్లో వారిని ముప్పుతిప్పలు పెడుతోంది. సైనిక తిరుగుబాటును వ్యతిరేకిస్తున్న ఎవరినీ ఉపేక్షించడం లేదు. దేశ అగ్రనాయకురాలు ఆంగ్​సాన్​ సూకీపై తాజాగా క్రిమినల్​ అభియోగాలను మోపింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి ఉద్దేశించిన చట్టాన్ని ఆమె ఉల్లంఘించారని ఆరోపించింది.

ఒక వీడియో లింక్​ ద్వారా సూకీని కోర్టులో హాజరుపరిచింది. ఇదే చట్టం కింద ఆమెపై కేసు పెట్టడం ఇది రెండోసారి. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య అనుకూలవాదుల నిరసనలు కొనసాగుతున్నాయి. వాటిని దారుణంగా అణచివేసేందుకు సైన్యం తూటాలను కురిపిస్తూనే ఉంది. ఫిబ్రవరి 1 నుంచి ఈ నెల 11 నాటికి 706 మంది ఆందోళనకారులు నేలకొరిగారు.

ఇదీ చూడండి: అణు కర్మాగారంపై దాడి ఇజ్రాయెల్ పనే: ఇరాన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.