ETV Bharat / international

'ప్రజాస్వామ్యం కోసం మాతో చేతులు కలపండి' - మయన్మార్​లో సైన్యం తిరుగుబాటు

మయన్మార్​లో ప్రజాస్వామ్యం కావాలంటే తమతో చేతులు కలపాలని అక్కడి సైన్యం కోరింది. దేశం ఐక్యంగా ఉన్నప్పుడే.. సార్వభౌమత్వాన్ని కాపాడుకోగలమని వ్యాఖ్యానించింది. ఆ దేశంలో జాతీయ జెండా పండుగ సందర్భంగా.. ఈ మేరకు మయన్మార్​ సైన్యాధినేత పిలుపునిచ్చారు.

Myanmar coup leader
'ప్రజాస్వామ్యం కోసం సైన్యంతో చేతులు కలపండి'
author img

By

Published : Feb 12, 2021, 5:54 PM IST

Updated : Feb 12, 2021, 6:15 PM IST

మయన్మార్​లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్న తరుణంలో సైన్యం కీలక ప్రకటన చేసింది. ప్రజాస్వామ్యం కావాలంటే తమతో కలిసి పని చేయాలని మయన్మార్​ సైన్యాధినేత మిన్‌ ఆంగ్‌ లయాంగ్‌ పిలుపునిచ్చారు. మయన్మార్​ జాతీయ జెండా పండుగ వేడుకల్లో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

"ప్రజాస్వామ్యం విజయవంతంగా కొనసాగడానికి సైన్యంతో చేతులు కలపాలని మొత్తం దేశాన్ని కోరుతున్నాను. జాతీయ ఐక్యత మాత్రమే దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడగలవని చారిత్రక పాఠాలు మనకు నేర్పించాయి"

-- మిన్‌ ఆంగ్‌ లయాంగ్, మయన్మార్​ సైన్యాధినేత

జెండా పండుగను పురస్కరించుకుని.. వేలాది మంది ఖైదీలను కూడా సైన్యం విడుదల చేసిందని.. మయన్మార్​ వార్తా పత్రికలు కథనాలు ప్రచురించాయి. నవంబర్​లో జరిగిన ఎన్నికల అవకతవకలపై సూకీ ప్రభుత్వం సరైన విచారణ చేపట్టకపోవడం వల్లే తాము అధికారాన్ని చేపట్టవలసి వచ్చిందని ఈ వేడుకల్లో సైన్యం వివరించింది. అయితే.. అలాంటిదేమీ జరగలేదని ఆ దేశ ఎన్నికల సంఘం చెబుతుండటం గమనార్హం.

మయన్మార్​లో జాతీయ జెండా పండుగ- నిరసనలు

అంతర్జాతీయ సమాజం వ్యతిరేకిస్తున్నందునే..

సైన్యం తిరుగుబాటుపై అంతర్జాతీయ సమాజం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో సైన్యం ఈ మేరకు సానుకూల వైఖరి అవలంబిస్తోందని తెలుస్తోంది. అంతకుముందు.. మయన్మార్​ సైనిక చర్యను అమెరికా ఖండించింది. అమెరికా ఆస్తులు, నిధులు వినియోగించకుండా అక్కడి సైనిక ప్రభుత్వంపై ఆంక్షలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. మయన్మార్​ సంక్షోభం అమెరికా విదేశాంగ విధానానికి విరుద్ధంగా ఉందని తెలిపారు.

ఫేస్​బుక్​ ఆంక్షలు..

మయన్మార్​ సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా.. తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నందున సైన్యం ఆధ్వర్యంలోని ఫేస్​బుక్​ ఖాతాలపై ఆ సంస్థ విస్తృత ఆంక్షలు విధించింది. తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

చైనాకు వ్యతిరేకంగా..

మయన్మార్​ సైనిక తిరుగుబాటుకు మద్దతునిస్తున్న చైనాకు వ్యతిరేకంగా నిరసనకారులు.. ఆందోళన నిర్వహించారు. శాంతికాముక దేశంలో అలజడులు చెలరేగడానికి కారణం చైనాయేనని ధ్వజమెత్తారు. వివిధ రకాల వయస్సుల వారు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 12, 2021, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.