ETV Bharat / international

సౌదీ రాజ వంశంలో గొడవలే పాక్​కు​ కొత్త అస్త్రాలు! - Saudi royal family

సౌదీ అరేబియాతో సంబంధాలు దెబ్బతినడం వల్ల పాకిస్థాన్​ రూటు మార్చింది. ప్రస్తుత యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ (ఎంబీఎస్‌)ను దారిలోకి తెచ్చుకోవాలని తన ప్రత్యర్థి, సోదరుడు అహ్మద్​తో ఇమ్రాన్​ ఖాన్​ ప్రభుత్వం చేతులు కలిపినట్లు తెలుస్తోంది. అసలు ఆ రాజ కుటుంబంలో వైరం ఎలా మొదలైంది..? ఆ ఇంటి గొడవలతో లాభపడాలని పాక్​ అనుకోవడం వెనుక కారణాలేంటి..?

Pakistan colludes with MBS' rivals in Royal family
సౌదీ కుటుంబంలో గొడవులే పాక్​ సరికొత్త అస్త్రాలు..?
author img

By

Published : Aug 23, 2020, 1:00 PM IST

సౌదీ అరేబియా రాజ కుటుంబంలోని గొడవలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది పాకిస్థాన్. ఇటీవలే కశ్మీర్‌ అంశంపై సౌదీతో సహా ఇతర ముస్లిం దేశాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించి భంగపడింది దాయాది దేశం. దీంతో సౌదీపై తీవ్ర విమర్శలు చేసి ఆ దేశం ఆగ్రహానికి గురైంది. ఈ నేపథ్యంలో పాక్​ రూట్​ మార్చింది. సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ (ఎంబీఎస్‌)తో విభేదాలు ఉన్న తన సోదరుడు ప్రిన్స్‌ అహ్మద్‌ బిన్‌ అబ్దులాజీజ్‌ అల్‌-సౌద్‌కు పాక్​ మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది.

salman bin abdulaziz bin salman al saud
ప్రిన్స్‌ అహ్మద్‌ బిన్‌ అబ్దులాజీజ్‌ అల్‌-సౌద్‌

అలా మొదలైంది...

57 దేశాలు ఉన్న ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌‌(ఓఐసీ)లో సౌదీ, యూఏఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనిని సవాలు చేసే విధంగా మరో ప్రత్యామ్నాయ సంస్థను ఏర్పాటు చేసేందుకు టర్కీ, ఇరాన్‌, ఖతార్‌, మలేషియా ప్రయత్నించాయి. ఇందుకోసం గతేడాది కౌలాలంపూర్‌లో టర్కీ, మలేషియా ఓ సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాయి. దీనికి తొలుత పాక్‌ మద్దతు తెలిపినా.. సౌదీ కన్నెర్ర చేయడం వల్ల ఈ సదస్సు నుంచి వైదొలగింది. అప్పటి నుంచి పాక్‌పై సౌదీకి అనుమానాలు పెరిగాయి.

Pakistan colludes with MBS' rivals in Royal family
పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్, సౌదీ యువరాజు ఎంబీఎస్​

అపాయింట్​మెంట్​ ఇవ్వలే...

ఈ ఏడాది ఆగస్టు 5తో భారత ప్రభుత్వం ఆర్టికల్‌ 370ని రద్దు చేసి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి సౌదీ అరేబియాను బహిరంగంగానే విమర్శించారు. కశ్మీర్‌ విషయంలో తమతో కలిసి రావడంలేదని.. కలిసి వచ్చేవారితోనే పనిచేస్తామని అన్నారు. ఖురేషీ వ్యాఖ్యల్లో ఓఐసీకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామనే అర్థం ధ్వనించడం వల్ల సౌదీ అరేబియాకు కోపం వచ్చింది. పాక్‌ చర్యకు ప్రతిచర్య ఆ దేశ ఖజానాలో కనిపించింది. సౌదీ రుణంగా ఇచ్చిన 3 బిలియన్‌ డాలర్లను వాపస్‌ తీసుకోవడం మొదలుపెట్టింది. దీంతో చైనా నుంచి అప్పు తెచ్చి బిలియన్‌ డాలర్లను సౌదీకి తిరిగి చెల్లించింది ఇమ్రాన్​ ప్రభుత్వం.

భారత్‌తో కయ్యం పెట్టుకోవాలని పదేపదే పాక్‌ ఒత్తిడి తేవడం సౌదీకి ఏమాత్రం నచ్చలేదు. దీంతో పాకిస్థాన్‌ సైన్యాధిపతి కమర్‌ జావెద్‌ భజ్వా రంగంలోకి దిగి ఇరు దేశాల సంబంధాలను పూర్వస్థితికి తెచ్చేందుకు సౌదీకి పయనమయ్యారు. అక్కడ ఆయనకు యువరాజు సల్మాన్‌ అపాయింట్‌మెంట్‌ కూడా లభించలేదు. కేవలం రక్షణ శాఖ సహాయ మంత్రి ఖలీద్‌ బిన్‌ సల్మాన్, సైన్యాధిపతి ఫయాద్‌తో భేటీ మాత్రమే జరిగింది. ఇది పాక్‌కు పెద్ద ఎదురుదెబ్బ.

పాకిస్థాన్‌ సైన్యాధిపతి కమర్‌ జావెద్‌ భజ్వా

యువరాజు ప్రత్యర్థితో పొత్తు...!

సౌదీతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో కొత్త ఎత్తులు వేస్తోంది పాకిస్థాన్​. ఇందులో భాగంగా రాజకుటుంబంలో ఎంబీఎస్​కు ప్రత్యర్థి అయిన తన సోదరుడు ప్రిన్స్‌ అహ్మద్‌ బిన్‌ అబ్దులాజీజ్‌ అల్‌-సౌద్‌తో ఇస్లామాబాద్ చేతులు కలిపినట్లు తెలుస్తోంది.

చరిత్ర మారిందప్పుడే...

సౌదీ రాచరిక సంప్రదాయం ప్రకారం.. సోదరుల మధ్యే రాజకీయ వారసత్వం ఉంటుంది. ఇది రాజ్య వ్యవస్థాపకుడు అబ్దులాజీజ్ ఇబ్న్ సౌద్ నుంచి కొనసాగుతూ వస్తోంది. అయితే 2007లో కింగ్ అబ్దుల్లా ఈ వ్యవస్థను మార్చారు. కుటుంబంతో ఓ అల్లెజియన్స్​ కౌన్సిల్​ ఏర్పాటు చేసిన ఆయన.. వారే తర్వాత యువరాజును ఎన్నుకుంటారని తేల్చిచెప్పారు. ఈ నిర్ణయంతో ఆ రాజ కుటుంబంలో గొడవలు, చీలికలు మొదలయ్యాయి. కింగ్ ఇబ్న్ సౌద్ భార్య అయిన యువరాణి హుస్సా బింట్ అహ్మద్ అల్ సుదౌరీ.. తన కుమారులను అధికారం నుంచి దూరం చేయడానికే ఇలా చేశారని ఆరోపించారు.

2015 జనవరిలో అబ్దుల్లా మరణించాక.. సుదౌరీ రాజ్య పరిపాలనా విభాగంలోని ప్రముఖులను తొలగించి తన కొడుకు సల్మాన్​ను రాజుగా నియమించడంలో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత రెండేళ్లకు సల్మాన్​ కుమారుడు ఎంబీఎస్​ను 2017లో యువరాజుగా ప్రకటించారు.

కీలక నిర్ణయాలతో పేరు ప్రఖ్యాతలు..

గత మూడేళ్లుగా అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎంబీఎస్​. పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలను అరెస్టులు చేశారు. ఆర్థిక, సామాజిక అంశాల్లో పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాదు అమెరికాతో సన్నిహితంగా ఉండే సౌదీ కేవలం చమురుతోనే ఇస్లాం ప్రపంచంపై పట్టు సాధించలేమని గుర్తించింది. దీంతో మెల్లగా దేశంలో ఇతర రంగాలను కూడా అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలోనే పర్యటకం, అధిక నైపుణ్య ఆధారిత ఉద్యోగాలపై దృష్టి సారించి యువతను ఆకట్టుకోగలిగారు ఎంబీఎస్​. ఇంధన రంగంలో ప్రైవేటును భాగస్వామ్యం చేసి ఉద్యోగాలను పెంచారు.

సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌

సామాజికంగానూ పలు విప్లవాత్మక మార్పులకు ఎంబీఎస్​ నాంది పలికారు. మహిళలు కార్లు నడపడమే కాకుండా మగవాళ్ల అనుమతి లేకుండా వారికి పనిచేసుకునే అధికారం ఇచ్చారు. ఎన్నో ఆంక్షలు ఉండే సంగీతం, క్రీడలు, వినోద పరిశ్రమలో చాలా సడలింపులు ఇచ్చారు. ఫలితంగా ఆయా రంగాలు అభివృద్ధి చెందడం ప్రారంభమైంది.

అలా గొడవలు తారస్థాయికి...

2018లో జర్నలిస్ట్‌ ఖషోగ్గి హత్య నేపథ్యంలో యువరాజుపై అంతర్జాతీయంగా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీన్ని అదనుగా చేసుకొని రాజు సల్మాన్‌ సోదరుడు ప్రిన్స్‌ అహ్మద్‌ అధికారాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు 2017లో ప్రయత్నించారన్న వార్తలు వచ్చాయి. ఈ మేరకు ఎంబీఎస్‌ అహ్మద్‌కు లొంగిపోయినట్లు అక్కడి మీడియా కథనాలు కూడా ప్రచురించాయి. దీన్ని ఏమాత్రం సహించని యువరాజు వారిపై చర్యలకు ఉపక్రమించారు. ఆయనతో పాటు తన అహ్మద్ కుమారులు మహ్మద్‌ బిన్‌ నాయెఫ్‌, నవాఫ్‌ బిన్‌ నాయెఫ్‌ను అరెస్టు చేయించారు ఎంబీఎస్​. అప్పుడు నుంచి ఈ ఇరు కుటుంబాల మధ్య వైరం నడుస్తోంది. అయితే ఎంబీఎస్​కు​ వ్యతిరేకంగా ఉన్న ప్రిన్స్​ అహ్మద్​కు మద్దతుగా పాక్​ నిలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

పాక్​ ఎన్ని పన్నాగాలు పన్నినా.. ఓ పక్క అగ్రరాజ్యం అమెరికాతో పాటు సౌదీ సైన్యం, నిఘా​ వర్గాల మద్దతుతో ఎంబీఎస్​ ధీమాగానే ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.