ETV Bharat / international

ఫేస్​బుక్​లో టాపర్ మోదీనే- నెంబర్ 2 ట్రంప్!

author img

By

Published : Apr 24, 2020, 2:34 PM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫేస్​బుక్​లో అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా మరోసారి వార్తలకెక్కారు. ప్రపంచ నేతలు-2020 పేరుతో బర్సన్ కోహన్ అనే సంస్థ విడుదల చేసిన ర్యాంకింగ్స్​లో అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో కొనసాగుతున్నారు మోదీ. ట్రంప్ రెండోస్థానంలో నిలవగా.. జోర్డాన్ మహారాణి రనియా మూడో స్థానంలో ఉన్నారు.

modi
ఫేస్​బుక్​లో ప్రధాని మోదీదే అగ్రస్థానం

ఫేస్​బుక్​ సామాజిక మాధ్యమంలో తానే రారాజునని మరోసారి చాటారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. 'ఫేస్​బుక్​లో ప్రపంచ నేతలు-2020' పేరుతో బర్సన్ కోహన్ అండ్ ఒల్ఫ్ కమ్యూనికేషన్స్ ఏజెన్సీ విడుదల చేసిన నివేదికలో నాలుగు కోట్ల యాభై లక్షల లైకులతో మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. రెండు కోట్ల డెబ్భై లక్షల లైకులతో రెండో స్థానంలో నిలిచారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కోటీ అరవై లక్షల ఎనభై వేల లైకులతో జోర్డాన్ మహారాణి రనియా మూడో స్థానంలో నిలిచారు.

అభిమానుల్లోనూ మోదీ హవా..

ఫేస్​బుక్ ఫ్యాన్ ఫాలోయింగ్​​లో కూడా మోదీనే ప్రథమ స్థానంలో కొనసాగుతున్నారు. ఆయనకు సామాజిక మాధ్యమంలో పదిహేడు లక్షలమంది అభిమానులు ఉన్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారోకు 9,56,000.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్​కు 8,77,000 మంది అభిమానులు ఉన్నట్లు సమాచారం.

అందులో ట్రంప్​దే అగ్రస్థానం..

అయితే ఫేస్​బుక్​ ఇంటరాక్షన్స్​లో ట్రంప్ మొదటి స్థానంలో ఉన్నారు. గత పన్నెండు నెలల కాలంలో ట్రంప్​ పేజ్​కు 30 కోట్ల 90 లక్షల కామెంట్స్, లైక్స్​, షేర్స్ వచ్చాయి. 20 కోట్ల 5 లక్షల ఇంటరాక్షన్స్​తో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో రెండోస్థానంలో, 8 కోట్ల 40 లక్షల ఇంటరాక్షన్స్​తో మోదీ మూడో స్థానంలో ఉన్నారు.

ప్రపంచ నేతలకు సంబంధించిన మార్చి నెలలోని 721 పేజీల సమాచారాన్ని బర్సన్ సంస్థ విశ్లేషించింది. తమ అధ్యయనం మేరకు తాజా ర్యాంకింగ్స్​ను విడుదల చేసింది.

ఇదీ చూడండి: కరోనాపై పోలీసుల ప్రాంక్​.. వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.