ETV Bharat / international

సరికొత్త ఫీచర్లతో 'ఎల్​జీ' సూపర్‌ స్మార్ట్‌ మాస్క్‌ - LG smart mask

కరోనా విస్తరణ కొనసాగుతున్న నేపథ్యంలో సాంకేతికతను జోడించి ఓ స్మార్ట్‌ మాస్క్‌ను రూపొందించింది ప్రముఖ సంస్థ ఎల్‌జీ. ఎల్‌జీ ప్యూరీకేర్‌ వేరబుల్ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ పేరుతో ఈ మాస్క్‌ అందుబాటులోకి తీసుకురానున్నారు. మరి ఈ మాస్క్​లో ఉండే ఫీచర్లు ఏంటో చూద్దాం.

LG Unveils smart air purifier mask
సరికొత్త ఫీచర్లతో ఎల్​జీ సూపర్‌ స్మార్ట్‌ మాస్క్‌
author img

By

Published : Aug 29, 2020, 10:39 PM IST

ప్రస్తుతం మాస్క్‌ లేకుండా బయటికి రాలేని పరిస్థితి. దీనికి తగ్గట్టుగా రకరకాల మాస్కులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా వ్యాపార సంస్థలు భిన్నమైన మాస్క్‌లను రూపొందిస్తున్నాయి. కొంతమంది వాటికి సాంకేతికతను కూడా జోడిస్తున్నారు. తాజాగా ఎల్‌జీ ఓ స్మార్ట్‌ మాస్క్‌ను రూపొందించింది. ఎల్‌జీ ప్యూరీకేర్‌ వేరబుల్ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ పేరుతో ఈ మాస్క్‌ తీసుకొస్తున్నారు.

మాస్క్‌ ఫీచర్స్‌

సాధారణ మాస్క్‌లో ఉండే దీంట్లో గాలిని శుద్ధి చేసేందుకు ఇందులో హెచ్‌13 హెచ్‌ఈపీఏ ఫిల్టర్లను ఉపయోగించారు. మాస్క్‌కు రెండు వైపులా చిన్న ఫ్యాన్లను అమర్చారు. వీటికి మూడు స్పీడ్ లెవెల్స్ ఉంటాయి. ఇవి మనం గాలి పీల్చే విధానాన్ని అనుసరించి ఫ్యాన్ల వేగాన్ని ఆటోమేటిగ్గా సరిచేసుకుంటాయి. అంటే గాలి పీల్చుకునేప్పుడు వేగం పెరిగి, వదిలేప్పుడు నెమ్మదిస్తాయి. ఈ మాస్క్‌లో రెస్పిరేటరీ సెన్సార్‌ను కూడా ఉంది. ముఖానికి చక్కగా నప్పే ఆకృతిలో దీనిని రూపొందించారు.

LG Unveils smart air purifier mask
సరికొత్త ఫీచర్లతో ఎల్​జీ సూపర్‌ స్మార్ట్‌ మాస్క్‌

820 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఉపయోగించారు. లోమోడ్‌లో 8 గంటలు, హైమోడ్‌లో 2 గంటలు పనిచేస్తుంది. మాస్క్‌ను ఛార్జ్‌ చేసేందుకు అల్ట్రావైలెట్ (యు.వి) ఎల్‌ఈడీ లైట్లతో ఉన్న కేస్‌ ఇస్తున్నారు. అంతే కాకుండా ఫిల్టర్లు మార్చాల్సి సమయం వచ్చినప్పుడు ఎల్‌జీ థిం‌క్యూ మొబైల్ యాప్‌ ద్వారా యూజర్‌కు నోటిఫేకేషన్‌ వెళుతుంది. దానిని అనుసరించి మాస్క్‌లోని ఫిల్టర్స్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే దీని ధర, మార్కెట్లోకి పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది వంటి వివరాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు.

ఇదీ చూడండి: ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్లకు చేరువలో కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.