పాకిస్థాన్ సాంస్కృతిక రాజధాని లాహోర్.. ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరంగా నిలిచింది. ప్రపంచ నగరాల్లోని వాయు నాణ్యత సూచీల ఆధారంగా అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ ఈమేరకు తేల్చింది.
అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ ప్రకారం వాయు నాణ్యత పీఎం 50 పాయింట్ల కంటే తక్కువ నమోదైతే 'సంతృప్తికరం'. గాలి నాణ్యత పీఎం 301 పాయింట్లు దాటితే 'ప్రమాదకరం'.
మొదటి మూడు స్థానాలు
- లాహోర్(పాకిస్థాన్)-పీఎం 423 పాయింట్లు
- దిల్లీ(భారత్) - పీఎం 229 పాయింట్లు
- కాఠ్మాండూ(నేపాల్)- పీఎం 178 పాయింట్లు
కలుషిత నగరాల జాబితాలో పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీ ఏడో స్థానంలో ఉంది.
ఇదీ చదవండి: దిల్లీలో ఇంకా తీవ్ర స్థాయిలోనే గాలి నాణ్యత