ETV Bharat / international

'ఏదైనా జరగొచ్చు.. అన్నింటికీ సిద్ధంగా ఉండండి' - కేపీ శర్మ ఓలి

నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలి.. శనివారం ఆ దేశ రాష్ట్రపతితో సమవేశమయ్యారు. అనంతరం తన మంత్రులతో భేటీ అయి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రధానిగా ఓలి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. తనను గద్దెదింపడానికి కుట్ర జరుగుతోందని.. మంత్రులు దేనికైనా సిద్ధంగా ఉండాలని ఓలి సూచించినట్టు సమాచారం.

KP Oli, Nepal PM meets president and his ministers amid political crisis
'ఏదైనా జరగొచ్చు.. అన్నింటికీ సిద్ధంగాా ఉండండి'
author img

By

Published : Jul 4, 2020, 10:36 PM IST

Updated : Jul 5, 2020, 11:56 AM IST

తన రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో నేపాల్​ ప్రధానమంత్రి కే పీ శర్మ ఓలి శనివారం కీలక సమావేశాలు జరిపారు. తొలుత నేపాల్​ రాష్ట్రపతి బైద్యదేవీ భండారీతో భేటీ అయిన ఓలి.. అనంతరం తన మంత్రులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో తనను గద్దె దించడానికి కుట్ర జరుగుతోందని.. అందువల్ల అందరూ దేనికైనా సిద్ధంగా ఉండాలని మంత్రులకు ఓలి తెలిపినట్టు సమాచారం.

"పార్టీ ఐకమత్యం ప్రమాదంలో పడింది. ఏదైనా జరగొచ్చు. రాష్ట్రపతికి, నాకు వ్యతిరేకంగా కొందరు కుట్ర పన్నుతున్నారు. మీరందరూ(మంత్రులు) ఓ స్పష్టతకు రావాలి. దేనికైనా సిద్ధంగా ఉండాలి."

-- కే పీ శర్మ ఓలి, నేపాల్​ ప్రధానమంత్రి.

భారత్​తో సరిహద్దు వివాదం నేపథ్యంలో ఓలి వైఖరిపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తనపై భారత్​ కుట్ర పన్నుతోందన్న ఓలి ఆరోపణలతో.. సొంత పార్టీ నుంచే ప్రధానికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ప్రధాని రాజీనామాకు పార్టీ సీనియర్​ నేతలు డిమాండ్​ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓలి భవితవ్యాన్ని తేల్చడానికి అధికార నేపాల్​ కమ్యూనిస్ట్​ పార్టీ శనివారం భేటీకావాల్సి ఉంది.కాని కొన్ని కారణలాతో సమావేశం సోమవారానికి వాయిదా పడింది.

ఇదీ చూడండి:- నేపాల్ ప్రధానికి ఎందుకీ 'రాజీ'నామా కష్టం?

Last Updated : Jul 5, 2020, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.