ETV Bharat / international

ప్రకృతి ఒడిలో ఆటలాడేందుకు కిండర్​ గార్టెన్​ - కిండర్​ గార్టెన్​

పిల్లల నర్సరీ అనగానే రకరకాల బొమ్మలు, ఆట వస్తువులు  వంటివి మనం చూస్తుంటాం. ఆస్ట్రేలియా మెల్​బోర్న్​లో ఓ కిండర్​ గార్టెన్​ మాత్రం భిన్నంగా కనిపిస్తుంది. రకరకాల మొక్కలు, చెట్లు, రాళ్లు రప్పలు, మట్టి, బురదతో  తలపిన చిన్న అడవిని చూడొచ్చు. పిల్లలంతా ఎంతో సరదాగా వీటి మధ్య ఆడుతూ ఎంతో ఉల్లాసంగా గడుపుతారు.

ప్రకృతి ఒడిలో ఆటలాడేందుకు కిండర్​ గార్టెన్​
author img

By

Published : Aug 30, 2019, 7:03 AM IST

Updated : Sep 28, 2019, 8:02 PM IST

ప్రకృతి ఒడిలో ఆటలాడేందుకు కిండర్​ గార్టెన్​

ఆస్ట్రేలియాలోని మెల్​బోర్న్​లో ఓ పిల్లల నర్సరీ అడవిని తలపిస్తుంది. ఇదంతా పిల్లల ఆడుకోవడానికి సిద్ధం చేశారు. పిల్లలు బొమ్మలతో ఆడుకునే బదులుగా మొక్కలు నాటుతూ, చెట్లకు నీరు పోస్తూ, రాళ్లతో ఆడుకుంటూ సమయాన్ని గడుపుతుంటారు.

దీని పేరు ఇసాబెల్ హెండర్సన్ కిండర్ గార్టెన్. మెల్​బోర్న్​లోని రన్​ సెంటర్​ కమ్యూనిటీలో ఓ పాతపడిన ఫ్యాక్టరీని అటవీ ప్రాంతంగా మార్చారు.

బొమ్మలను తొలగించడం ద్వారా పిల్లలు స్వతహాగా తమ వినోదాన్ని తామె వెతుక్కొని, చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు. దీనివల్ల సృజనాత్మకత పెరుగుతుంది. ప్రతి కదలిక, ఆలోచన, అనుభవం, సందర్భం.. ఒక్కో జ్ఞాపకంగా మారుతుంది. ఈ స్మృతులు మెదడు పొరల్లో నిక్షిప్తమవుతూ వారి ఆలోచన శక్తిని అభివృద్ధి చేస్తుంది. వారికి భవిష్యత్తులో ప్రకృతితో కలిసి జీవించటం అలవరచుకుంటారు.

"ఇది వారి ఆలోచనాస్థాయిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. మనకున్న స్థలంలో అందరితో ఎలా ఆడుకోవాలో నేర్పిస్తుంది."

-నికోల్​ మెస్సర్​, కిండర్​ గార్టెన్​ డైరెక్టర్​

ప్రకృతి గురించి తెలుసుకోవడానికి పర్యావరణ పుస్తకాలు చడవడం లేదా తరగతి గదిలో సంబంధిత అభ్యాసాలను చెయ్యడం ఎంత మాత్రం సరిపోదు. చిన్ననాటి నుంచి పిల్లలను ప్రకృతిలో భాగం చేయటం ఓ వినూత్న ఆలోచన.

ఇదీ చూడండి : పర్యావరణహితం: మొక్కగా మారే బొజ్జ గణపయ్య

Intro:Body:

A 30 foot eco-friendly Coconut Ganesha created by using 9 thousand 

Conclusion:
Last Updated : Sep 28, 2019, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.