పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్‌పై విద్వేషాన్ని వెల్లగక్కుతూనే ఉన్నారు పాకిస్థాన్ నేతలు. పెషావర్ రాష్ట్ర రాజధానైన ఖైబర్ పక్తుంఖ్వా అసెంబ్లీలో 'పాకిస్థాన్ పీపుల్స్' పార్టీకి చెందిన షేర్ ఆజం అనే మంత్రి 'హిందువులు మన దేశానికి శత్రువులు' అని వ్యాఖ్యానించారు. దీనిపై శాసనసభ్యులు రవికుమార్, రంజిత్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు.
అనంతరం తన వ్యాఖ్యలకు ఆజం క్షమాపణలు చెప్పారు. హిందువులకు బదులుగా హిందుస్థాన్ పదం వాడి ఉండాల్సిందని ఆజం వివరణిచ్చారు.
నిరసన తెలుపుతూ వాకౌట్ చేసిన ఇద్దరిని అసెంబ్లీ సభ్యులు వెనక్కి తీసుకొచ్చారు. స్పీకర్ ముస్తాక్ ఘనీ మంత్రి ఆజం వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.