జపాన్లో భారీ భూకంపం సంభవించింది. ఫుకుషిమా నగరానికి ఈశాన్య తీరంలో భూప్రకంపనలు ఏర్పడ్డాయి. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత నమోదైనట్లు జపాన్ వాతావరణ విభాగం తెలిపింది.
ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. ఈ భూకంపం.. సునామీగా మారే అవకాశం లేదని అధికారులు తెలిపారు.