ETV Bharat / international

హగీబిస్​: తుపాను బీభత్సానికి 56 మంది మృతి - హగీబిస్​ తుపాను

జపాన్​లో ప్రకృతి విలయతాండవం నుంచి ప్రజలను రక్షించేందుకు సహాయక చర్యలు మరింత వేగవంతం చేసింది అక్కడి ప్రభుత్వం. హగీబిస్​ తుపాను సృష్టించిన బీభత్సంతో ఇప్పటివరకు 56 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది ప్రభుత్వం.

హగీబిస్​: తుపాను బీభత్సానికి 56 మంది మృతి
author img

By

Published : Oct 15, 2019, 5:42 AM IST

తుపాను బీభత్సం... కొనసాగుతున్న సహాయక చర్యలు

హగీబిస్​ తుపాను సృష్టించిన బీభత్సంతో జపాన్​ చిగురుటాకులా వణికిపోయింది. భారీ వర్షాలు, తీవ్రమైన గాలులతో తూర్పు ప్రాంతమంతా అతలాకుతలం అయింది. ఈ విధ్వంసంలో 56 మంది మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. వందల మంది గాయపడ్డారు.

తుపాను తీవ్రత తగ్గిన నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరం చేసింది జపాన్​ ప్రభుత్వం. సహాయక చర్యల కోసం సైన్యం, అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపింది. వరదల్లో చిక్కుకున్నవారిని హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. మరికొన్ని చోట్ల పడవల ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నారు.

గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వరదలు మిగిల్చిన బురదలో, ఉద్ధృతంగా ప్రవహించే నదుల్లో జల్లెడ పడుతున్నారు.

జపాన్​లో విధ్వంసం

భారీ వర్షాలతో జపాన్‌లోని పలు నగరాలు, పట్టణాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అత్యంత ఖరీదైన నగరం టోక్యోలో అత్యధిక భాగం బురదతో నిండిపోయింది. యాపిల్​ తోటలన్నీ కొట్టుకుపోయాయి. విద్యుత్​ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి.

కోలుకుంటున్న టోక్యో

జపాన్​ రాజధాని టోక్యోలో నీటి సరఫరా, విద్యుత్​ సేవలు పునరుద్ధరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ప్రధాని షింజో అబే తెలిపారు. ప్రధాన మార్గాల్లో బుల్లెట్ ​రైళ్లను పరిమిత సంఖ్యలో నడుపుతున్నారు.

ఇదీ చూడండి : 'అమిత్​ షా'కు అస్వస్థత.. ప్రచారానికి నేడు దూరం

Hazaribagh (Jharkhand), Oct 14 (ANI): Chief Minister of Jharkhand, Raghubar Das attended a passing out parade in Hazaribagh. Almost 2,504 new police officials have been deployed including 138 female police officials, this year. While addressing them, he said, "I hope the police officials will help make Jharkhand free of crime, corruption free and extremism free."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.