ETV Bharat / international

'మురికి మాస్కులు పంచారని ఆ దేశ ప్రధానిపై ఫిర్యాదులు!' - Japan government faces complaints

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచదేశాలన్నీ మాస్కులనే ఆయుధంగా ఎంచుకున్నాయి. అందులో భాగంగానే జపాన్​లోని షింజో అబే ప్రభుత్వం.. ఆ దేశ ప్రజలకు తొడుగులు పంపిణీ చేసింది. అయితే అవి నాసిరకంగానూ, మురికిగానూ ఉన్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

Japan government faces complaints after giving out dirty masks
మురికి మాస్కులు పంచారని ఆ దేశ ప్రధానిపై ఫిర్యాదులు!
author img

By

Published : Apr 20, 2020, 7:36 AM IST

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా షింజో అబే నేతృత్వంలోని జపాన్​ ప్రభుత్వం దేశమంతటా మాస్కులు పంపిణీ చేసింది. అయితే అవి నాసిరకంగా ఉన్నాయని, పాత వస్త్రంతో తయారైనవని ఆరోపణలు చేస్తున్నారు ప్రజలు. గర్భిణీలకు పంపిన వేల మాస్కులు మురికిగా ఉన్నాయని ప్రధానిపై, ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. తమకు మురికి(అసహ్యమైన) మాస్కులు అందాయనే కారణంతో.. 80 మున్సిపాలిటీల్లో సుమారు 1,900 కేసులు నమోదయ్యాయని జపాన్​ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

జపాన్​లో మాస్కుల కొరతను అరికట్టేందుకు ప్రధాని.. ఒక్కో ఇంటికి రెండు మాస్కుల చొప్పున పంచాలని ప్రకటించారు. ఇందులో గర్భిణీలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం.. సుమారు 5 లక్షల మాస్కులను పంపిణీ చేసింది. అయితే అవన్నీ బాగాలేవని తెలిపారు. అంతేకాకుండా వాటి పరిమాణమూ చాలా చిన్నగా ఉన్నాయని విమర్శించారు.

కరోనా కట్టడికి ముందస్తుగా చర్యలు చేపట్టలేదని, జాప్యం చేసిందని ఇప్పటికే జపాన్​లోని అబే ప్రభుత్వం విమర్శల్ని ఎదుర్కొంటోంది.

ఇదీ చూడండి: ప్రధాని మెచ్చిన ఆ చిన్నారి 'కరోనా వీడియో' వైరల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.