ETV Bharat / international

'అఫ్గాన్​ సమగ్రతను కాపాడేలా శాంతి ప్రక్రియ ఉండాలి'

author img

By

Published : Sep 12, 2020, 6:50 PM IST

అఫ్గానిస్థాన్​లో శాంతిస్థాపన దిశగా అక్కడి​ ప్రభుత్వం- తాలిబన్ల మధ్య శనివారం చర్చలు జరిగాయి. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా చర్చల్లో పాల్గొన్నారు భారత విదేశాంగమంత్రి జైశంకర్​. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, మైనార్టీలు, మహిళలు, అణగారిన వర్గాల హక్కులను కాపాడేలా.. హింసకు తావులేకుండా శాంతి ప్రక్రియ ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు స్పష్టం చేశారు.

Jaishankar attends meeting on Afghan peace process
'అఫ్గాన్​ సమగ్రతను కాపాడేలా శాంతి ప్రక్రియ ఉండాలి'

అమెరికా సమక్షంలో శనివారం అఫ్గానిస్థాన్​-తాలిబన్ల మధ్య జరిగిన చర్చల్లో భారత విదేశాంగ మంత్ర జైశంకర్​ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొన్నారు. అఫ్గాన్‌ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడేలా శాంతి ప్రక్రియ ఉండాలన్నారు జైశంకర్​. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, మైనార్టీలు, మహిళలు, అణగారినవర్గాల హక్కులను కాపాడేలా.. హింసకు తావులేకుండా శాంతిప్రక్రియ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఆఫ్గాన్‌ భూభాగం నుంచి భారత్​కు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలు జరగకూడదని ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు.

అంతర్గత యుద్ధంతో దెబ్బతిన్న ఆఫ్గన్‌లో శాంతి, సుస్థిరత నెలకొనాలని ఆకాంక్షిస్తున్న భారత్‌... ఆ దేశ పునర్నిర్మాణానికి 2బిలియన్‌ డాలర్ల సాయం అందించింది.

'అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

ఈ చర్చల ద్వారా అందిన చారిత్రక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. దేశంలో ఎన్నో దశాబ్దాలుగా ఉన్న సమస్యలకు విస్తృత, సమగ్ర రాజకీయ పరమైన పరిష్కారాన్ని అఫ్గాన్​ నేతలు కనుగొనాలని ఆశాభావం వ్యక్తం చేసింది పాకిస్థాన్​. చర్చల్లో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొన్న పాక్​ విదేశాంగమంత్రి మహమ్ముద్​ ఖురేషి ఈ వ్యాఖ్యలు చేశారు. తమ నిర్ణయాలకు అన్ని వర్గాలు కట్టుబడి ఉంటాయని కోరుకుంటున్నట్టు వెల్లడించారు.

దశాబ్దాల వివాదానికి తెరదించే దిశగా అఫ్గానిస్థాన్​ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య శనివారం చర్చలు జరిగాయి. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమక్షంలో ఖతార్​ రాజధాని దోహాలో ఈ శాంతి చర్చలను నిర్వహిస్తున్నారు. రాజ్యాంగం మార్పులు, అధికార విభజణపై ఇరుపక్షాలు చర్చించనున్నాయి.

ఇదీ చూడండి:- తాలిబన్ల ఘాతుకానికి 16 మంది సైనికులు బలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.