ETV Bharat / international

'అధ్యక్ష ప్రమాణ స్వీకారంలో పేలుళ్లు మా పనే' - Afghanistan IS

అఫ్గానిస్థాన్​ అధ్యక్ష భవనం సమీపంలో జరిగిన పేలుళ్లుకు బాధ్యత వహిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్ర సంస్థ. దేశ అధ్యక్షునిగా అష్రఫ్​ ఘనీ, ప్రత్యర్థి అబ్దుల్లా అబ్దుల్లాలు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో 10 రాకెట్లను ప్రయోగించినట్లు వెల్లడించింది.

IS claims attack at Afghan presidential inauguration
అఫ్గాన్​ పేలుళ్లకు బాధ్యత వహించిన ఐఎస్​ ఉగ్రవాద సంస్థ
author img

By

Published : Mar 9, 2020, 10:14 PM IST

అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్​లో అధ్యక్ష ప్యాలస్​ సమీపంలో జరిగిన పేలుళ్లు తమ పనేనని ప్రకటించింది ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్ర సంస్థ. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా జిహాదీ గ్రూప్​ ప్రకటన విడుదల చేసింది.

"అష్రఫ్​ ఘనీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని కాలిఫట్​ సైనికులు దాడులు చేశారు. కాబుల్​లోని అధ్యక్ష ప్యాలస్​ సమీపంలో 10 రాకెట్లను ప్రయోగించారు."

- ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్రసంస్థ ప్రకటన.

గత సెప్టెంబర్​లో అఫ్గాన్​ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే.. ఈ ఎన్నికలను ప్రత్యర్థి పార్టీ అధినేత అబ్దుల్లా అబ్దుల్లా తిరస్కరించారు. ఈ నేపథ్యంలో రాజకీయ సంక్షోభం నెలకొంది.

రాజకీయ గందరగోళం మధ్యే సోమవారం ఇరుపార్టీల నేతలు అధ్యక్షులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమం జరుగుతుండగా రెండు సార్లు పేలుళ్లు జరిగాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.