ETV Bharat / international

'ఉక్రెయిన్ విమానాన్ని కూల్చేసిన వారిని శిక్షిస్తాం' - ఉక్రెయిన్ విమానాన్ని కూల్చివేసిన వారిని శిక్షిస్తాం: రౌహాని

ఉక్రెయిన్ విమానాన్ని కూల్చివేసిన ఘటనపై ఇరాన్ అధ్యక్షుడు హసన్​ రౌహాని స్పందించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు. విమానం కూల్చివేతకు కారణమైన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడైమిర్ జెలెన్​స్కీకి హామీ ఇచ్చారు.

Iran's Rouhani promises to punish those behind plane's downing: Ukraine
ఉక్రెయిన్ విమానాన్ని కూల్చివేసిన వారిని శిక్షిస్తాం: రౌహాని
author img

By

Published : Jan 12, 2020, 4:45 AM IST

Updated : Jan 12, 2020, 7:25 AM IST

ఉక్రెయిన్ విమానాన్ని పొరపాటున కూల్చివేయడంపై ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని, దుర్ఘటనకు కారకులైన వారిని గుర్తించి శిక్షిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడైమిర్ జెలెన్​స్కీకి హామీ ఇచ్చారు.

176 మంది అమాయకులు బలి

గత బుధవారం తెల్లవారుజామున టెహ్రాన్‌ విమానాశ్రయం నుంచి ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు బయల్దేరిన బోయింగ్‌ 737 విమానం టేకాఫ్‌ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలింది. ఈ ఘటనలో 176 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఉక్రెయిన్‌ దేశస్థులతో పాటు ఇరాన్‌కు చెందిన 82 మంది, కెనడాకు చెందిన 63 మంది ప్రయాణికులున్నారు.

శత్రు భయంతో.. పొరపాటు

అనుమానాలు నిజం చేస్తూ... ఉక్రెయిన్​ విమానాన్ని తామే కూల్చినట్లు ఇరాన్‌ మిలిటరీ శనివారం వెల్లడించింది. అయితే ఉద్దేశపూర్వకంగా తాము విమానాన్ని కూల్చలేదని, మానవ తప్పిదం కారణంగానే అలా జరిగిందని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌ విమానం రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన మిలిటరీ కేంద్రం వైపు వచ్చినందున దాన్ని శత్రు దేశపు విమానంగా భావించామని తెలిపింది.

న్యాయం కావాలి

ఇరాన్... ఉక్రెయిన్​ విమానాన్ని కూల్చివేయడంపై కెనడా, ఉక్రెయిన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశాయి.

ఇదీ చూడండి: సరికొత్త రికార్డు స్థాయికి విదేశీ మారకపు నిల్వలు

Intro:Body:

sdfsdfsdf

Conclusion:
Last Updated : Jan 12, 2020, 7:25 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.