ETV Bharat / international

Internet outage: ఆగిన వెబ్​సైట్లు, యాప్​లు

ప్రపంచవ్యాప్తంగా అంతర్జాలం కొద్దిసేపు నిలిచిపోయింది(Internet outage). హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజీ సహా పలు ఆర్థిక సంస్థల వెబ్​సైట్లు, యాప్​లపై ఈ ప్రభావం కనిపించింది. బ్యాంకింగ్, ఎయిర్​లైన్ సేవలకూ అంతరాయం ఏర్పడింది.

Internet outages briefly disrupt access to websites, apps
ఇంటర్నెట్ డౌన్- ఆగిన వెబ్​సైట్లు, యాప్​లు
author img

By

Published : Jun 17, 2021, 2:49 PM IST

Updated : Jun 17, 2021, 3:20 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్(Internet outage)​ కొద్ది సమయం పాటు నిలిచిపోయింది. ఫలితంగా పలు ఆర్థిక సంస్థల వెబ్​సైట్లు, యాప్​లు ఆగిపోయాయి. ఎయిర్​లైన్లు, ఇతర కంపెనీలపైనా ఈ ప్రభావం కనిపించింది. ఇంటర్నెట్ మానిటరింగ్ వెబ్​సైట్లు అయిన థౌజండ్​ఐస్, డౌన్​డిటెక్టర్ వంటి మాధ్యమాలు పలుమార్లు నిలిచిపోయాయి.

తమ వెబ్​సైట్​లో సాంకేతిక సమస్యలు ఏర్పడినట్టు హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజీ ట్విట్టర్ మాధ్యమం ద్వారా వెల్లడించింది. 17 నిమిషాల తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని తెలిపింది.

ఆస్ట్రేలియాలో బ్యాంకింగ్, విమాన బుకింగ్, పోస్టల్ సేవల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. 'బాహ్య అంతరాయాల' వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆ దేశ తపాలా సేవల సంస్థ ఆస్ట్రేలియా పోస్ట్ పేర్కొంది. అనంతరం సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. సమస్యను పరిశీలిస్తున్నట్లు వివరించింది.

రిజర్వ్ బ్యాంక్ సైతం..

వీటితో పాటు అనేక ఇతర సేవలు గంట పాటు నిలిచిపోయి.. మళ్లీ ప్రారంభమయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా సహా కామన్​వెల్త్, ఏఎన్​జడ్, సెయింట్ జార్జ్, వెస్ట్​పాక్ వంటి బ్యాంకింగ్ సంస్థలన్నీ ఈ అంతరానికి లోనయ్యాయి. ప్రస్తుతం ఈ సంస్థల వెబ్​సైట్​లన్నీ దాదాపుగా సాధారణ స్థితికి చేరుకున్నాయి.

కారణం ఇదే!

అంతర్జాల సేవల సంస్థ 'అకమై'కు చెందిన వ్యవస్థలో సమస్య వల్ల తమ సేవలకు అంతరాయం కలిగిందని ప్రముఖ విమానయాన సంస్థ వర్జిన్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ప్రపంచంలోని అనేక బడా సంస్థలు, బ్యాంకులకు అకమై సంస్థ.. అంతర్జాల సేవలు అందిస్తోంది. ఈ విషయంపై సంస్థ వివరణ కోరేందుకు ఫోన్​ చేసినప్పటికీ.. అకమై స్పందించలేదు.

మొన్ననే ఓసారి..

కొద్దిరోజుల క్రితమే అంతర్జాలం నిలిచిపోయి అనేక బడా సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఫాస్ట్​లీ అనే వెబ్ సర్వీస్ కంపెనీ సాఫ్ట్​వేర్​లో సమస్య కారణంగా.. అమెజాన్, రెడిట్, సీఎన్​ఎన్​, న్యూయార్క్​ టైమ్స్​ వంటి సంస్థల వెబ్​సైట్స్ డౌన్​ అయ్యాయి.

ఇదీ చదవండి: బుల్లి శాటిలైట్​తో బుడతడి ప్రపంచ రికార్డులు

Last Updated : Jun 17, 2021, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.