తీవ్రమైన వ్యవసాయ పద్ధతుల వల్ల ప్రజా ఆరోగ్యం ప్రభావితమవుతోందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ వ్యవసాయ పద్ధతులను పరిశీలించాల్సిన అవసరం ఉందని బ్రిటన్‌లోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అధ్యయనంలో పేర్కొన్నారు. ఆహార విషానికి ప్రధాన కారణమైన బాక్టర్ జెజుని అనే బాక్టీరియా పరిణామక్రమాన్ని అంచనా వేసిన శాస్త్రవేత్తలు జన్యువులను బదిలీ చేయగల సామర్థ్యం ఉన్న ఈ బ్యాక్టీరియా వాతావరణానికి అనుగుణంగా ఎక్కువ జాతులకు సోకుతుందని వెల్లడించారు.
జంతువుల జన్యు వైవిధ్యాన్ని మార్చడం వల్ల వచ్చే వ్యాధికారకాలు ప్రజారోగ్యానికి పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉందని వారు వెల్లడించారు. ఈ బ్యాక్టీరియా సోకిన మాంసాన్ని తినేటప్పుడు ప్రజలకు కూడా బదిలీ అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. యాంటీ బయోటిక్స్, మితిమీరిన వ్యవసాయ పద్ధతులు, మారుతున్న జన్యు పరిమాణం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావితం చూపుతున్నాయని తెలిపారు.
పశువుల ఆహారం, శరీర నిర్మాణంలో మార్పులు వ్యాధికారక జన్యువుల బదిలీని ప్రేరేపించాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మానవ కార్యకలాపాలు పర్యావరణం, జీవ వైవిధ్యం, పశు జాతులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయని వెల్లడించారు.