ETV Bharat / international

తల్లి పాల ద్వారా కరోనా వైరస్​ వ్యాపిస్తుందా? - Infants born to mothers

గర్భణిలకు కరోనా​ సోకితో పుట్టే శిశువు పరిస్థితి ఏంటన్న అంశంపై పరిశోధన చేశారు చైనాకు చెందిన పూడాన్​ విశ్వవిద్యాలయ ఆచార్యులు. మొత్తం 33 మందిపై అధ్యయనం చేయగా ముగ్గురు శిశువుల్లో మాత్రమే వైరస్​ లక్షణాలు కనిపించినట్లు తెలిపారు. వీరికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

Infants born to mothers with COVID-19 may catch infection: Study
తల్లి పాల ద్వారా కరోనా వైరస్​ వ్యాపిస్తుందా?
author img

By

Published : Mar 30, 2020, 9:06 AM IST

కరోనా​... యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్న సరికొత్త మహమ్మారి. ఆ వైరస్​ ఎలా ఉంటుంది? చికిత్స ఎలా? వ్యాక్సిన్​ ఏది?... ఇలా ప్రతి అంశమూ వైద్యులకు కొత్తే. అందుకే ప్రపంచవ్యాప్తంగా కరోనాకు సంబంధించి విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి.

వైరస్​తో బాధ పడుతున్న గర్భణీల ద్వారా పుట్టబోయే శిశివుకు కూడా వ్యాధి సంక్రమిస్తుందా అన్న దానిపై అధ్యయనం చేశారు చైనా పుడాన్​ విశ్వవిద్యాలయ పరిశోధకులు. మొత్తం 33 గర్భణిలపై పరిశోధనలు చేయగా వారిలో ముగ్గురికి పుట్టిన శిశువులు మాత్రమే మహమ్మారితో బాధపడుతున్నట్లు గ్రహించారు. వీరికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆ ముగ్గురు శిశివుల్లోనూ ఒకే రకమైన లక్షణాలు కనిపించినట్లు తెలిపారు.

మొదటి శిశువు...

గర్భం దాల్చిన 40 వారాల తర్వాత శిశువుకు జన్మనిచ్చించి తల్లి. పుట్టిన రెండో రోజున జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించిన అధికారులు.. శిశువును ఐసీయూకు తరలించారు. ఆ శిశువు నిమోనియాతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వైరస్​ పరీక్షలు నిర్వహించగా నాలుగు రోజుల పాటు వరుసగా కరోనా పాటిజివ్​గా వచ్చింది. ఆరో రోజు మాత్రం వైరస్ నెగటివ్​గా తేలింది.

రెండో శిశువు...

గర్భం దాల్చిన 40 వారాల తర్వాత సిజేరియన్​ చికిత్స ద్వారా శిశువును బయటకు తీశారు. పుట్టిన శిశువుకు వాంతులు, జ్వరం, నిమోనియా వంటి లక్షణాలు కనిపించాయి. వైరస్​ పరీక్షలు నిర్వహించగా రెండు నుంచి 4వ రోజు వరకు కరోనా పాజిటివ్​గా, ఆరో రోజు నెగటివ్​గా వచ్చింది.

మూడో శిశువు...

31 వారాల రెండు రోజుల తర్వాత గర్భిణి శస్త్రచికిత్స ద్వారా శిశువుకు జన్మనిచ్చింది. ఈ చిన్నారి కూడా నిమెనియాతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వెంటిలేషన్​, యాంటీ బయాటిక్స్​ ద్వారా 14 రోజుల పాటు వైద్య పరిశీలనలో ఉంచారు.

ముగ్గురు శిశువులు కూడా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు నివేదికలో పేర్కొన్నారు. తల్లి పాలలో కరోనా వైరస్​ను గుర్తించలేదని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.