ETV Bharat / international

వివాదాల నడుమ భారత్​కు ఇమ్రాన్​..! - భారత్‌కు రానున్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్న సమయంలో.. పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ భారత్​ రానున్నారు. షాంఘై కో ఆపరేషన్​ ఆర్గనైజేషన్​(ఎస్​సీఓ) సదస్సుకు ఇమ్రాన్​ను ఆహ్వానించనుంది భారత్​. దిల్లీలో ఈ ఏడాదే సదస్సు జరగనుంది. ఎస్​సీఓలో ఓ సభ్యదేశంగా ఉన్న పాక్​ తరఫున ఆ దేశ ప్రధాని హాజరుకానున్నారు. కొన్నేళ్లుగా భారత్​-పాక్​ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇమ్రాన్​ హాజరవుతారా.. లేదా.. అన్న అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.

india-to-invite-imran-other-leaders-for-scos-annual-heads-of-government-meeting
వివాదాల నడుమ భారత్​కు ఇమ్రాన్​..!
author img

By

Published : Jan 17, 2020, 6:17 AM IST

Updated : Jan 17, 2020, 2:45 PM IST

వివాదాల నడుమ భారత్​కు ఇమ్రాన్

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. భారత్‌కు రానున్నారు. ఈ ఏడాది చివర్లో దిల్లీలో నిర్వహించే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు ఇమ్రాన్​ను ఆహ్వానిస్తామని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ విలేకరుల సమావేశంలో గురువారం ప్రకటించారు. ఎస్‌సీఓలో పాక్‌తో పాటు 8 సభ్యదేశాలు, నాలుగు అబ్జర్వర్​ స్టేట్స్​తో పాటు ఇతర అంతర్జాతీయ ప్రతినిధులను భారత్​ ఆహ్వానించనున్నట్లు స్పష్టం చేశారు.

వివాదాల నడుమ భారత్‌కు ఇమ్రాన్!

భారత్-పాకిస్థాన్ మధ్య గత మూడేళ్లుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉరీలోని సైనిక శిబిరంపై ఉగ్రదాడులు, అందుకు ప్రతిగా భారత సైన్యం చేసిన మెరుపుదాడులతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. గతేడాది పుల్వామాలో.. సైన్యం ప్రయాణిస్తున్న వాహనాలపై పాకిస్థాన్ బాంబు దాడులకు పాల్పడడంతో... బాలాకోట్‌లోని ఉగ్ర శిబిరాలను వైమానిక దాడులతో భారత్ నాశనం చేసింది. తర్వాత కశ్మీర్‌లో అధికరణ- 370 రద్దు వంటి పరిణామాల నేపథ్యంలో భారత్-పాక్ మధ్య వివాదాలు మరింత ముదిరాయి. ఈ నేపథ్యంలో.. ఇమ్రాన్​ వస్తారా.. లేదా... అన్న అంశంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

ఎస్​సీఓ అంటే....

ఆర్థిక, భద్రతాపరమైన అంశాల్లో సహకారం కోసం చైనా నాయకత్వంలో ఎస్‌సీఓ పని చేస్తుంది. ఇందులో పాకిస్థాన్, భారత్ 2017లో చేరాయి. గతేడాది జూన్‌లో కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్​లో జరిగిన ఎస్‌సీఓ సదస్సుకు భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ హాజరయ్యారు.

ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు నిధులు సమకూర్చుతున్న దేశాలే ఇందుకు బాధ్యత వహించాలని ఆ సందర్భంగా ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పరస్ఫర సహకారం అందించుకోవాలని సభ్య దేశాలకు మోదీ పిలుపునిచ్చారు.

ZCZC
PRI ESPL NAT WRG
.MUMBAI BES34
MH-SEX RACKET
'High-profile' sex racket busted; girl among 3 rescued, 1 held
         Mumbai, Jan 16 (PTI) Police have busted a "high-
profile" sex racket operating in a three-star hotel in
suburban Andheri and arrested a 29-year-old woman and rescued
three female artists, including a minor, an official said on
Thursday.
         The Social Service (SS) branch of the city police
conducted the raid at the hotel at Andheri East on Thursday,
the official said.
         "During the raid, three females, including a minor,
were found to have been forced into prostitution. They were
rescued and a woman, identified as Priya Sharma, who was
operating the racket, was arrested," he said.
         "Sharma was running a tours and travel agency in
Kandivali East. However, she was involved in immoral
activities," senior inspector of SS branch, Sandesh Revale,
said.
         While one of the rescued is a woman actor and singer,
who has worked in 'Savdhaan India' TV crime show, he said,
another one has worked in a Marathi movie and serials.
         The minor has worked in a web series, Revale added.
         The offence was being registered against Sharma, he
said. PTI DC
NP
NP
01162313
NNNN
Last Updated : Jan 17, 2020, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.