అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ మరోసారి భారత్‌పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. గతంలో భారత్‌ను పన్నుల రారాజుగా అభిర్ణించిన ఆయన.. భారత్, చైనా ఇక ఏమాత్రం అభివృద్ధి చెందుతున్న దేశాలు కావని ఆరోపించారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల పేరిట ఇరుదేశాలు..ఇకపై ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీఓ (ప్రపంచ వాణిజ్య సంస్థ) నుంచి లబ్ధి పొందే అవకాశం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన భారత్, చైనాకు అభివృద్ధి చెందుతున్న దేశాల హోదాను ఏ ప్రాతిపదికన కట్టబెట్టారో వివరించాలంటూ గత నెలలో ట్రంప్ ప్రపంచ వాణిజ్య సంస్థపై అసహనం వ్యక్తం చేశారు.
డబ్ల్యూటీఓ నిబంధనల ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉత్పత్తయే వస్తువులపై దిగుమతి, ఎగుమతి సుంకాలలో మినహాయింపు లభిస్తుంది. వాణిజ్యపరమైన వివాదాల పరిష్కారానికి అంతర్జాతీయ సంస్థలు సహకారం అందిస్తాయి. ఈమేరకు అనేక రంగాల్లో గణనీయ స్థిరవృద్ధి కనబరుస్తున్న భారత్‌కు ప్రపంచ వాణిజ్య సంస్థ కొన్నేళ్లుగా అభివృద్ధి చెందుతున్న దేశం హోదా ఇస్తోంది. దీన్ని సమర్థంగా వినియోగించుకుంటున్న భారత్.. పేదరికం లాంటి సామాజిక సమస్యల్ని రూపుమాపడంలో గణనీయమైన అభివృద్ధి సాధించింది.