ETV Bharat / international

చైనాకు రష్యా షాక్.. ఎస్-400 క్షిపణుల డెలివరీకి నో - రష్యా వర్సెస్ చైనా

చైనాకు అందించాల్సిన ఎస్​-400 క్షిపణుల పంపిణీని రష్యా నిలిపివేసింది. దీన్ని ఎప్పుడు పునరుద్ధరిస్తుందో కూడా చెప్పలేదు. ఇది చైనాకు గట్టి ఎదురుదెబ్బేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

In another setback to China, Russia suspends deliveries of S-400 missiles
చైనాకు ఎస్-400 క్షిపణుల పంపిణీని నిలిపివేసిన రష్యా
author img

By

Published : Jul 27, 2020, 5:55 PM IST

చైనాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మిత్రదేశం రష్యా... చైనాకు ఎస్​-400 క్షిపణుల పంపిణీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి డెలివరీని ఎప్పుడు పునరుద్ధరిస్తుందో కూడా స్పష్టం చేయలేదు.

చైనా వార్తాపత్రిక సోహు రాసిన వార్తా కథనాన్ని ప్రస్తావిస్తూ... యూఏవైర్ పత్రిక కీలక వ్యాఖ్యలు చేసింది.

"చైనాకు అందించాల్సిన 'ఎస్​-400 క్షిపణుల పంపిణీని వాయిదా వేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఇది ఒకందుకు చైనాకు మంచే చేస్తుందని భావించవచ్చు. ఆయుధాన్ని పొందడం... దస్త్రాలపై సంతకం చేయడమంత సులువు కాదు కదా!"

- యూఏవైర్

ఇటీవలి కాలంలో డ్రాగన్ గూఢచర్యానికి పాల్పడుతోందని తీవ్ర ఆరోపణలు చేసిన రష్యా... తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా కారణంగానే..

రష్యా ప్రకటనపై చైనా భిన్నంగా స్పందించింది. కరోనా విజృంభిస్తున్న వేళ ఎస్​-400 క్షిపణులను చైనాకు సరఫరా చేయడం మంచిది కాదని... అందుకే రష్యా ఇలాంటి నిర్ణయం తీసుకుందని పేర్కొంది.

క్లిష్టమైన ప్రక్రియ

"ఈ ఎస్​-400 క్షిపణుల పంపిణీ చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఈ ఆయుధ ప్రయోగంలో శిక్షణ కోసం చైనా తన సిబ్బందిని పంపాల్సి ఉంది. అలాగే రష్యా కూడా.. ఆ ఆయుధ ప్రయోగం తెలిపే చాలా మంది సాంకేతిక నిపుణులను పంపాల్సిన అవసరం ఉంది."

- సోహు, చైనా వార్తాపత్రిక

భీకర ఆయుధం

రష్యాకు చెందిన టాస్ వార్తా సంస్థ ప్రకారం, 2018లో రష్యా నుంచి మొదటి బ్యాచ్​ ఎస్​-400 క్షిపణులను చైనా అందుకుంది. అత్యాధునికమైన ఈ క్షిపణితో 30 కి.మీ ఎత్తులోని, 400 కి.మీ దూరంలోని శత్రు లక్ష్యాలను ధ్వంసం చేయవచ్చు.

గట్టి దెబ్బే

సెయింట్ పీటర్స్​బర్గ్ ఆర్కిటిక్ సోషల్ సైన్సెన్స్ అకాడమీ అధ్యక్షుడిగా పనిచేసిన వాలెరి మిట్కో... రహస్య సమాచారాన్ని చైనా నిఘా వర్గాలకు అందించినట్లు రష్యా గుర్తించింది. అలా తమపై చైనా గూఢచర్యానికి పాల్పడినందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఎస్​-400 క్షిపణుల పంపిణీని నిలిపివేసింది.

ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్​: పర్యటకం బంద్​.. సమావేశాలు వాయిదా

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.