పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి హద్దు దాటారు. ఐక్యరాజ్యసమితి 74వ సర్వసభ్య సమావేశంలో 50 నిమిషాలకు పైగా మాట్లాడి సభ గౌరవాన్ని ఉల్లంఘించారు. ఇమ్రాన్ మాట్లాడిన సమయంలో దాదాపు అరగంటకు పైగా కశ్మీర్ విషయాన్ని ప్రస్తావించారు.
సర్వసభ్య సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోదీ.. భారత్లోని 130 కోట్ల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. ఉగ్రవాద నిర్మూలన, శాంతి సామరస్యం తదితర అంశాలపై మోదీ మొత్తం సమావేశంలో 16 నిమిషాలు మాట్లాడారు.
ఈ సమావేశాలలో 193 దేశాలకు చెందిన ప్రతినిధులు మాట్లాడతారు. ఒక్కొక్క ప్రతినిధికి ఐరాస స్పీకర్ 15 నుంచి 20 నిముషాలు మాట్లాడటానికి అనుమతిని ఇస్తారు. ఈ సమావేశాలు 7 నుంచి 8 రోజుల పాటు కొనసాగుతాయి.
ఇప్పటి వరకు ఐరాస సర్వసభ్య సమావేశాలలో క్యూబా మాజీ ప్రధాని ఫిడేల్ క్యాస్ట్రో... 1960 సెప్టెంబర్ 6న అత్యధికంగా 269 నిమిషాలు మాట్లాడారు. ఇదే ఇప్పటి వరకు రికార్డు.
ఇదీ చూడండి:తీరప్రాంతంలో శత్రువులు దాడి చేసే ప్రమాదం'