ETV Bharat / international

డేంజర్‌ 'డెల్టా'కు చైనా చెక్‌.. ఎలా సాధ్యమైందంటే?

author img

By

Published : Aug 26, 2021, 5:36 AM IST

అత్యంత వేగంగా వ్యాపించే డెల్టా వేరియంట్​ను చైనా విజయవంతంగా కట్టడి చేసింది. సాధారణ కరోనా వైరస్ మాదిరిగానే ఈ వేరియంట్​కూ కళ్లెం వేసింది. అనేక దేశాలు డెల్టా దెబ్బకు అతలాకుతలమవుతుంటే.. చైనాలో వైరస్ కట్టడి ఎలా సాధ్యమైంది? డ్రాగన్ అవలంబించిన వ్యూహమేంటి?

china defeated delta variant
డెల్టా వేరియంట్​పై చైనా విజయం

ప్రపంచ దేశాలను వణికిస్తున్న డెల్టా వేరియంట్‌(delta variant in china) వ్యాప్తిని చైనా కట్టడి చేసింది. గతంలో వచ్చిన సాధారణ కరోనా వైరస్‌ని జయించినంత తేలిగ్గా ఈ డేంజర్‌ 'డెల్టా'దూకుడుకు కళ్లెం వేయగలిగింది. జులై మధ్యలో తొలి కేసు వెలుగు చూడగా.. ఈ నెల మధ్యకాలం నాటికి వైరస్‌ మరింతగా విజృంభించింది. దీంతో అప్రమత్తమైన డ్రాగన్‌.. కేవలం నెల రోజుల వ్యవధిలోనే 'డెల్టా' కొమ్ములు వంచి 'సున్నా'కు తీసుకురావడంలో విజయవంతమైంది. డెల్టాను ఎదుర్కోవడంలో అనేక దేశాలు సతమతమవుతుంటే.. అత్యధిక జనాభా కలిగిన చైనాకు ఇదెలా సాధ్యమైంది?

శరవేగంగా వ్యాప్తి.. అంతే త్వరగా 'సున్నా'కి..

చైనాలోని నాన్‌జింగ్‌ విమానాశ్రయంలో తొలిసారి డెల్టా కేసు వెలుగుచూసింది. విమానాశ్రయంలో హౌస్‌కీపింగ్‌ సిబ్బందికి వైరస్‌ సోకింది. ఆ మరుసటి రోజే వైరస్‌ కేసుల సంఖ్య 12కి చేరింది. అలా.. జులై చివరి వారం నాటికి రోజువారీ కేసుల సంఖ్య 50కి పెరిగాయి. 17 ప్రావిన్సుల్లోని 50 నగరాలకు వ్యాపించిన ఈ వైరస్‌ మూడు వారాల్లోనే రోజువారీ కేసులు 100కి చేరుకున్నాయి. దాదాపు ఏడాది పాటు కొవిడ్‌ రహిత ప్రాంతంగా ఉన్న వుహాన్‌లోకి కూడా ప్రవేశించింది. ఇంత వేగంగా వ్యాప్తి చెందడం చైనా కొవిడ్‌ నియంత్రణ మోడల్‌కు ఓ పరీక్షగా మారింది. అయితే, చైనాలో డెల్టా వేరియంట్‌ వ్యాప్తి ఎంత వేగంగా ఉందో.. డ్రాగన్‌ తీసుకున్న చర్యలతో అంతే త్వరగా అదుపులోకి వచ్చింది. ఆ మరుసటి వారానికే కొత్త కేసులు ఒక్క అంకెకు పడిపోగా.. ఆగస్టు 23 నాటికి సున్నాకు చేరడం విశేషం.

'డెల్టా' దూకుడుకు కళ్లెం ఇలా..

తొలి కేసు నమోదైనప్పటి నుంచే చైనా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా వైరస్‌ ప్రబలినప్పుడు ఎదుర్కొన్న వ్యూహాల అనుభవంతో డెల్టా వేరియంట్‌ కట్టడికి మరింత కఠినంగా వ్యవహరించింది. భారీగా పరీక్షలు నిర్వహించడంతో పాటు డెల్టా కేసులు నమోదైన ప్రాంతాల నుంచి బీజింగ్ సహా ఇతర ప్రాంతాలకు రాకపోకలపై ఆంక్షలు విధించింది. ప్రజల్ని ఎక్కడికక్కడే నిలువరించేందుకు కఠినంగా వ్యవహరించింది. కొవిడ్‌ హాట్‌స్పాట్‌ ప్రాంతాల నుంచి రైళ్లు, విమాన సర్వీసులను సైతం నిలిపివేసింది. ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు వారిని ఇంట్లోనే బందీలుగా చేసి బయటి నుంచి తాళాలు వేసి.. తలుపులకు ఇనుపరాడ్లు పెట్టి సీల్‌ వేసిన దృశ్యాలు కూడా గతంలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

లక్షణాల్లేని కేసు వస్తే.. కోటి పరీక్షలు

డెల్టా వైరస్‌ ఆనవాళ్లు తొలిసారి బయటపడిన నాన్‌జింగ్‌ ప్రాంతంలో 92లక్షలుగా ఉన్న జనాభాకు రెండుసార్లు పరీక్షలు నిర్వహించిన చైనా.. దేశంలో నెల రోజుల వ్యవధిలోనే 10 కోట్లకు పైగా పరీక్షలు చేసింది. సెంట్రల్‌ హెనాన్‌ ప్రావిన్స్‌లోని ఝెంగ్జౌ నగరంలో ఎలాంటి లక్షణాల్లేని ఒక కేసు బయటపడటంతో అధికారులు అక్కడ కోటి మందికి పరీక్షలు చేశారు. పర్యాటక ప్రాంతమైన ఝాంగ్జియాజీలో 15లక్షల మందిని ఇళ్లకే పరిమితం చేసి.. సందర్శనా ప్రదేశాలను మూసివేశారు.

ఆర్థిక నష్టాన్నీ లెక్కచేయకుండా..

డెల్టా కట్టడికి చైనా తీసుకున్న చర్యలు ఆ దేశానికి భారీగా ఆర్థిక నష్టం చేసినా వెనుకంజ వేయలేదు. జులై -ఆగస్టు మాసాల్లో వినియోగం, తయారీ రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులు వృద్ధిరేటు అంచనాలను తగ్గించాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆంక్షలు విధించాల్సి వచ్చినందున నష్టాలు భరించాల్సిందేనని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ స్పష్టం చేసింది. మరోవైపు, చైనాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సైతం అదే స్థాయిలో కొనసాగుతోంది. ఇప్పటిదాకా 194 కోట్ల డోసులు పంపిణీ చేయగా.. 77 కోట్ల మందికి రెండు డోసులు పూర్తయ్యాయి. చైనా అభివృద్ధి చేసిన టీకాలు డెల్టా రకంపై 60శాతం సమర్థత చూపుతుండగా.. వైరస్‌ తీవ్రత నుంచి 100శాతం మేర రక్షణ కల్పిస్తున్నట్టు అక్కడి అధికార యంత్రాంగం చెబుతోంది. కరోనా నియంత్రణ ఆర్థికాభివృద్ధికి, పెట్టుబడులకు మరింత సుస్థిరమై వాతావరణాన్ని కల్పిస్తుందని ఆ దేశ ఆరోగ్య మంత్రి పునరుద్ఘాటించారు.

ఇదీ చదవండి: ఒకే ఒక్క కేసు వచ్చిందని దేశమంతా లాక్​డౌన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.