హాంకాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చేపట్టి నాలుగు నెలలు గడుస్తున్నా.. ఆందోళనకారులు శాంతించడం లేదు. ఆదివారం షా టిన్ నగరంలో వందల మంది రోడ్లమీదకు వచ్చి ఆందోళనకు దిగారు.
బారికేడ్లను రోడ్లకు అడ్డంగా పెట్టి రవాణా వ్యవస్థను స్తంభింపజేశారు. చెత్తను దారికి అడ్డంగా పేర్చి నిప్పంటించారు. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్ చేశారు. అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు.
రక్తపాతం సృష్టించిన నిరసనలు
హాంకాంగ్‌లోని యువెన్ లాంగ్ స్టేషన్ వద్ద శనివారం నిరసకారులు ప్రదర్శనలు చేపట్టారు. తెల్లచొక్కాలు ధరించి వచ్చిన ఓ బృందం.. ఆందోళనకారులపై కర్రలతో విరుచుకుపడింది. ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో కొంత మందికి గాయాలయ్యాయి.
ఇదీ చూడండి: పచ్చని చిట్టి గువ్వా... నీ చిరునామా ఎక్కడ...?