హాంకాంగ్‌లో నేరస్థుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు తారస్థాయికి చేరుకున్నాయి. గత మూడు నెలలుగా నగరం అంతా హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోతోంది.
తాజాగా ఆదివారం నిరసనకారులు భారీ వర్షాలను సైతం లెక్క చెయ్యకుండా క్వాయ్చుంగ్ మైదానం నుంచి సుయెన్ వాన్ పార్కు వరకు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. చైనాకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ట్రాఫిక్ అడ్డంకులు, చెల్లా చెదురుగా పడి ఉన్న వెదురు స్తంభాలతో నిరసకారులు బారికోడ్లను నిర్మించారు.
ఆందోళనకారులు నిరసనలు విరమించుకోవాలని పోలీసులు హెచ్చరించారు. అయినప్పటికీ వారు వినలేదు. పరిస్థితిని అదుపు చేసేందుకు తొలిసారిగా జల ఫిరంగులను ప్రయోగించారు పోలీసులు. రక్షక భటుల చర్యతో ఆగ్రహానికి గురైన నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఫలితంగా ఆ ప్రాంతమంతా ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఇదీ చూడండి:హాంకాంగ్: చల్లారని సెగ- ఆందోళనలు హింసాత్మకం