హాంగ్‌కాంగ్... రణరంగాన్ని తలపిస్తోంది. వివాదాస్పద ఎక్స్ట్రాడిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంటు ముట్టడికి యత్నించారు ఆందోళనకారులు. చట్టసభకు నేతలు చేరుకోకుండా నగర వీధులన్నింటినీ దిగ్బంధించారు.
బిల్లుపై చర్చ జరగాల్సిన సమయంలో నిరసనలు ఉద్ధృతమవడంపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఆందోళనకారులపై బాష్పవాయువు, జల ఫిరంగులు ప్రయోగించారు.
ఘర్షణల దృష్ట్యా ఎక్స్ట్రాడిషన్ బిల్లుపై చర్చను వాయిదా వేశారు.
ఇదీ వివాదం....
నేరపూరిత చర్యలకు పాల్పడ్డ తమ దేశస్తులను విచారణ నిమిత్తం అవసరమైతే చైనాకు అప్పగించేందుకు వీలుగా హాంగ్‌కాంగ్ ప్రభుత్వం చట్టం తీసుకురావాలని చూస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లుపై నేడు చర్చ జరగాల్సి ఉంది.
ప్రభుత్వం రూపొందించిన బిల్లు... హాంగ్‌కాంగ్ స్వతంత్ర న్యాయవ్యవస్థను దెబ్బతీసేలా ఉందన్నది నిరసనకారుల వాదన.
ఇదీ చూడండి:- నీరవ్ మోదీకి నాల్గో సారి బెయిల్ నిరాకరణ